Telugu Movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే!

upcoming movies: జులైలో పలు ఆసక్తికర చిన్న చిత్రాలు బాక్సాఫీస్‌ను అలరించాయి. చివర్లో పవన్‌కల్యాణ్‌ ‘బ్రో’ వచ్చి బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసింది. ఇప్పుడు ఆగస్టు నెల వంతు. మరి ఆగస్టు మొదటి వారంలో థియేటర్‌తో పాటు, ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలేవో చూసేయండి

Updated : 31 Jul 2023 10:24 IST

బంధాల గురించి చెప్పే ‘ఎల్‌జీఎం’

భారత మాజీ క్రికెటర్‌ ఎం.ఎస్‌.ధోని నిర్మాణం నుంచి వస్తున్న తొలి చిత్రం ‘ఎల్‌జీఎం’ (LGM). లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌’.. అన్నది ఉపశీర్షిక. హరీష్‌ కల్యాణ్‌ (harish kalyan), ఇవానా (ivana) జంటగా నటించిన ఈ సినిమాని రమేష్‌ తమిళమణి తెరకెక్కించారు. సాక్షి ధోని, వికాస్‌ హస్జా నిర్మించారు. నదియా, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘స్వతంత్ర భావాలున్న అమ్మాయి కథ ఇది. మన జీవితంలోని బంధాలు, బంధుత్వాల గురించి తెలియజెప్పే చిత్రంలా ఉంటుంది’ అని చిత్ర బృందం తెలిపింది.


వైవిధ్యభరితమైన కథతో..

శివ కోన, ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాజుగారి కోడిపులావ్’ (Rajugari kodipulao). శివ కోన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. కుటుంబ ప్రేక్షకులను అలరించేలా ఒక వైవిధ్యమైన కథతో సినిమాను తెరకెక్కించినట్లు దర్శకుడు, నిర్మాత శివ కోన చెబుతున్నారు.


యాక్షన్‌ రాథోడ్‌..

విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా బాబు యోగేశ్వరన్‌ తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్‌ రాథోడ్‌’ (Vikram Rathode). ఎస్‌.కౌశల్య రాణి నిర్మాత. సురేష్‌ గోపి, సోనూసూద్‌, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 4న థియేటర్‌లలో విడుదల కానుంది. ప్రచార చిత్రాలను చూస్తే, దీన్నొక యాక్షన్‌ మూవీగా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది.


ఏం ‘మిస్టేక్‌’ జరిగింది?

అభినవ్‌ సర్దార్‌ హీరోగా నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రం ‘మిస్టేక్‌’ (Mistake). భరత్‌ కొమ్మాలపాటి దర్శకుడు. ఆగస్టు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  యాక్షన్‌, కామెడీ, సస్పెన్స్‌, థ్రిల్‌.. ఇలా అన్ని రకాల అంశాలు ఉన్న మూవీ మిస్టేక్‌ అని చిత్ర బృందం చెబుతోంది.



ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/సిరీస్‌లు

  • నెట్‌ఫ్లిక్స్‌
  • చూనా (హిందీ సిరీస్‌) ఆగస్టు 3
  • రంగబలి (Rangabali) (తెలుగు) ఆగస్టు 4

  • ది హంట్‌ ఫర్‌ వీరప్పన్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌) ఆగస్టు 4
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ 3 (హాలీవుడ్‌) ఆగస్టు 2
  • దయా (dayaa) (తెలుగు సిరీస్‌) ఆగస్టు 5


  • సోనీలివ్‌
  • పరేషాన్‌ (pareshan) (తెలుగు) ఆగస్టు 4
  • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
  • ధూమం (dhoomam) (కన్నడ, తెలుగు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని