Bigg boss telugu 5: నీ మీద నాకు ఎఫెక్షన్‌ లేదు.. నేను అంతర్యామిని కాదు కదా!

‘బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి కాజల్‌ వెళ్లిపోతే ఇంటి సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయంటూ’’ షణ్ముఖ్‌ (Shanmukh) అభిప్రాయం వ్యక్తం చేశాడు. హోరాహోరీగా సాగుతున్న బిగ్‌బాస్‌ (Bigg boss) సీజన్‌-5లో ప్రస్తుతం ఉన్న తొమ్మిది...

Published : 15 Nov 2021 16:59 IST

హైదరాబాద్‌: ‘‘బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి కాజల్‌ వెళ్లిపోతే ఇంటి సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయంటూ’’ షణ్ముఖ్‌ (Shanmukh) అభిప్రాయం వ్యక్తం చేశాడు. హోరాహోరీగా సాగుతున్న బిగ్‌బాస్‌ (Bigg boss) సీజన్‌-5లో ప్రస్తుతం ఉన్న తొమ్మిది మంది ఇంటి సభ్యుల మధ్య ఈ వారం నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ‘‘అందరికీ మనసులో ఉన్న నిజాలు బయటపెట్టే ధైర్యం ఉండదు. నిజాలను నిర్భయంగా నిలదీసే అవకాశమే ఈరోజు జరిగే నామినేషన్‌’’ అంటూ బిగ్‌బాస్‌ నామినేషన్‌ ప్రక్రియ గురించి ఇంటిసభ్యులకు తెలియజేశాడు. ఏ వ్యక్తినైనా నామినేట్‌ చేస్తే.. అందుకు గల కారణాన్ని ధైర్యంగా బయటపెట్టాలని తెలిపాడు.

దీంతో.. సన్నీని నామినేట్‌ చేసిన రవి (Ravi).. ‘‘నీ తప్పు నీకు చెబితే.. నేను ఎలా ఫేక్‌ అనిపించానో నాకు అర్థం కాలేదు. ఇప్పటికీ నేను ఫేక్‌ అనే అనుకుంటున్నావా’’ అని అడగ్గా.. ‘‘అందరి ముందు నా గురించి నువ్వు మాట్లాడటం నాకు నచ్చలేదు. అందుకే ఫేక్‌ అన్నాను. అయినా అది నా అభిప్రాయం. దాన్ని ఎవ్వరూ మార్చలేరు’’ అని సన్నీ (Sunny) సమాధానమిచ్చాడు. అనంతరం షణ్ముఖ్‌.. కాజల్‌ని నామినేట్‌ చేస్తున్నట్లు చెప్పాడు. కాజల్‌ (Kajal) వల్లే ఇంటిసభ్యుల మధ్య తరచూ గొడవలు వస్తున్నాయంటూ ఆయన అభిప్రాయపడ్డారు. మరి, మిగిలిన ఇంటిసభ్యులు ఎవర్ని నామినేట్‌ చేశారు? ఈ వారం నామినేషన్‌లో ఉన్న ఇంటిసభ్యులు ఎవరు? అనారోగ్య కారణాలతో జెస్సీ బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకి వచ్చేయడం చేత.. ఎలిమినేషన్‌ నుంచి బయటపడిన కాజల్‌ని ఈవారం ఎంతమంది నామినేట్‌ చేశారు? ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే ఈరోజు ప్రసారం కానున్న బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌ చూడాల్సిందే..!

Read latest Cinema News and Telugu News



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని