Butta Bomma: ‘బుట్టబొమ్మ’ అరుదైన రికార్డు

చిన్నాపెద్దా, క్లాస్‌-మాస్‌ అనే తేడా లేకుండా అందరినీ అలరించిన  ‘బుట్టబొమ్మ’ పాట అరుదైన రికార్డు సాధించింది. టాలీవుడ్‌కు సంబంధించి అత్యధిక వీక్షణలు, లైక్స్‌ సొంతం చేసుకున్న వీడియో సాంగ్‌గా నిలిచింది.

Published : 18 Nov 2021 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్నాపెద్దా, క్లాస్‌-మాస్‌ అనే తేడా లేకుండా అందరినీ అలరించిన ‘బుట్టబొమ్మ’ పాట అరుదైన రికార్డు సాధించింది. టాలీవుడ్‌కు సంబంధించి అత్యధిక వీక్షణలు, లైక్స్‌ సొంతం చేసుకున్న వీడియో సాంగ్‌గా నిలిచింది. 700 మిలియన్‌ (70 కోట్లు)కిపైగా వ్యూస్‌, 4 మిలియన్‌ (40 లక్షలు)కిపైగా లైక్స్‌తో యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. 2020 ఫిబ్రవరి 25న విడుదలైన ఈ వీడియోను ఆదరించిన వారందరికీ చిత్ర బృందం ధన్యవాదాలు తెలిపింది. అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని గీతమిది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు తమన్‌ స్వరాలు సమకూర్చారు. అర్మాన్‌ మాలిక్‌ ఆలపించారు. అద్భుతమైన సంగీతం, సాహిత్యం, గానంతోపాటు పూజా అందం, అల్లు అర్జున్‌ నృత్యం.. అన్నీ ఈ వీడియో విజయానికి కారణమయ్యాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని