RRR: ఉక్రెయిన్‌లో ల్యాండ్‌ అయిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం

స్నేహితుల దినోత్సవం కానుకుగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం ‘దోస్తీ’ గీతాన్ని అందించిన విషయం తెలిసిందే. ఐదు భాషల్లో ఐదుగురు ప్రముఖ గాయకులు ఆలపించిన ఈ పాట యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలు సొంతం చేసుకుంది.

Updated : 27 Aug 2021 21:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యావత్‌ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తెలుగు చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఇప్పటికే రెండు పాటల మినహా చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన భాగాన్ని చిత్రీకరించేందుకు ఆఖరి షెడ్యూల్‌ని ఉక్రెయిన్‌లో ప్లాన్‌ చేసింది చిత్రబృందం. ఈ మేరకు మంగళవారం ఉక్రెయిన్‌ పయనమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీం విమాన ప్రయాణ వీడియోను షేర్‌ చేసింది. ‘‘ఆఖరి షెడ్యూల్‌ కోసం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం ఉక్రెయిన్‌లో ల్యాండ్‌ అయింది’’ అని పేర్కొంది. పీరియాడికల్‌ డ్రామాగా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీంగా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. ఆలియా భట్‌, ఒలివియా మోరిస్‌ నాయికలు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘దోస్తీ’ సాంగ్‌ క్రెడిట్‌ అంతా వాళ్లకే: రాజమౌళి

స్నేహితుల దినోత్సవం కానుకుగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం ‘దోస్తీ’ గీతాన్ని అందించిన విషయం తెలిసిందే. ఒక్కో భాషలో ఒక్కో గాయకుడు ఆలపించిన ఈ పాట యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలు సొంతం చేసుకుంది. ఎంతోమంది ఆదరిస్తోన్న ఈ ఫ్రెండ్‌షిప్‌ సాంగ్‌పై చిత్ర దర్శకుడు రాజమౌళి  తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. పాటని చిత్రీకరించిన తన తనయుడు కార్తికేయని అభినందించారు. ‘ఈ పాట చిత్రీకరణ ఐడియా కార్తికేయది. తనూ కొరియోగ్రాఫర్‌ సతీశ్‌ కృష్ణన్‌, ఛాయాగ్రాహకుడు దినేశ్‌ కలిసి ‘దోస్తీ’ వీడియో రూపొందించారు. ఎలా చేశారో కానీ ఔట్‌పుట్‌ చూశాక చాలా ఆనందంగా ఉంది. ఇంతటి స్పందన వస్తుందని నేను ఊహించలేదు. స్వరాలు సమకూర్చిన అన్నయ్య కీరవాణి, సాహిత్యం అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రికే క్రెడిట్‌ అంతా దక్కుతుంది. తెలుగు సాహిత్యానికి అనుగుణంగా కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ పాటని రాసిన రచయితలు మదన్‌, రియా ముఖర్జీ, గోపాలకృష్ణన్‌, ఆజాద్‌కి ధన్యవాదాలు. ఈ పాటని చక్కగా ఆలపించడమే కాకుండా చిత్రీకరణలో పాల్గొన్న హేమచంద్ర, విజయ్‌ యేసుదాసు, అమిత్‌ త్రివేది, అనిరుధ్‌, యాజిన్‌ నైజర్‌కి కృతజ్ఞతలు’ అని రాజమౌళి ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని