Updated : 08/11/2021 15:44 IST

Raja Vikramarka: కార్తికేయను అనుకోలేదు కానీ అలా కుదిరేసింది..!

హైదరాబాద్‌: కార్తికేయ (Karthikeya) కథానాయకుడిగా నటించిన ‘రాజా విక్రమార్క’ (Raja Vikramarka) చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు శ్రీ సరిపల్లి. ఎన్‌ఐఏ ఏజెంట్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘రాజా విక్రమార్క’ సినిమా విశేషాల గురించి సరిపల్లి (Sri Saripalli) విలేకర్లతో ముచ్చటించారు.

విజయవాడనే..

మా సొంత ఊరు విజయవాడ. నాకు 22 సంవత్సరాలు వచ్చేవరకూ నేను అక్కడే ఉన్నాను. ఆ తర్వాత సినిమాపై ఉన్న ఆసక్తితో ఫిల్మ్‌మేకింగ్‌లో శిక్షణ తీసుకోవడానికి యూఎస్‌ వెళ్లి యూనివర్సల్‌ స్టూడియోలో చేరాను. శిక్షణ పూర్తైన తర్వాత అక్కడే నాలుగేళ్లపాటు సినిమాల్లో వర్క్‌ చేశాను. నాకు ట్రావెలింగ్‌ అంటే ఎంతో ఇష్టం. తరచూ కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్తుంటాను. ఇన్‌స్టాలో ఎక్కువగా నా ట్రావెలింగ్ ఫొటోలు షేర్ చేస్తుంటాను. అవి చూసిన ప్రతి ఒక్కరూ నేను విదేశాల నుంచి వచ్చాననుకుంటున్నారు.

వినాయక్‌తో పరిచయం..

ఇండియాకు ఇచ్చిన తర్వాత ఏ దర్శకుడి దగ్గర పనిచేయాలనే విషయంపై ఎంతో ఆలోచించాను. ఆ సమయంలో మా బంధువుల్లో ఒకరికి వినాయక్‌తో పరిచయం ఉందని తెలిసింది. ఆయన ద్వారా వినాయక్‌ని కలిసి.. 2012లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను. వినాయక్‌ తెరకెక్కించిన ‘నాయక్‌’, ‘అల్లుడు శ్రీను’ చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేశాను. అలా, మొదలైన నా ప్రయాణం ‘రాజా విక్రమార్క’తో దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను.

అతనే స్ఫూర్తి..

‘రాజా విక్రమార్క’ కథ రాయడానికి ముందు నేను సీబీఐ కాలనీ పక్కనే ఓ ఇంట్లో ఉండేవాడిని. మా ఇంటి కిటికీలో నుంచి చూస్తే రోజూ ఓ కుర్రాడు నాకు కనిపించేవాడు. చూడటానికి సాధారణ వ్యక్తిలా అనిపించేవాడు. కొంతకాలం తర్వాత తెలిసింది అతను జేడీ లక్ష్మినారాయణ టీమ్‌లో సభ్యుడని. ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఇలా సాధారణంగా ఉండే వ్యక్తులుంటారని తెలిసింది. అతడిని స్ఫూర్తిగా తీసుకునే ‘రాజా విక్రమార్క’ రాశాను.

కార్తికేయను అనుకోలేదు..

‘రాజా విక్రమార్క’ కథ రాసేటప్పుడు.. ఎవరైనా యువ హీరోని పెట్టి సినిమా చేయాలనుకున్నాను. కార్తికేయ నటించిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ రావడంతో ఆయన్ని చూశాను. నా సినిమాలో హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు కార్తికేయలో ఉన్నాయని నిర్ణయించుకున్నాను. అలా, ఆయన్ని కలిసి కథ చెప్పాను. ఓకే అయ్యింది. అయితే నాకు ఓకే చెప్పడానికంటే ముందే కార్తికేయ వేరే ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అవన్నీ పూర్తైన తర్వాతనే మా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కింది. అందుకే సినిమా కొంత ఆలస్యమైంది.

రాజా విక్రమార్క..

ఎన్‌ఐఏ ఏజెంట్‌.. తన విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సమస్యలను ఎంత సమర్థవంతంగా పరిష్కరించాడు అనే విషయాలను ఈ సినిమాలో చూపించాను. ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అన్నిరకాలుగా ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నాను. అయితే, మా కథకు నేను వేరే టైటిల్‌ అనుకున్నాను. కానీ అనౌన్స్‌ లేదు. షూటింగ్‌ 60 శాతం పూర్తి అయ్యాక ‘రాజా విక్రమార్క’ టైటిల్‌ పెడదామని ఆలోచన వచ్చింది. హీరో పాత్రకు ఆ టైటిల్‌తో సంబంధం ఉంటుంది.

తాన్య రవిచంద్రన్‌..

ఈ సినిమాలో ఆమె హోం మంత్రి కుమార్తెగా కనిపిస్తారు. తన కాళ్లపై తాను నిలబడాలనుకునే వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. క్లాసికల్‌ డ్యాన్స్‌ అంటే ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంది. తాన్య కూడా క్లాసికల్‌ డ్యాన్సర్‌ కావడంతో ఈ పాత్రకు ఆమెను ఓకే చేసేశాం. సినిమాలో కీ రోల్‌ కోసం ఎవర్ని ఎంచుకోవాలా? అని ఆలోచిస్తున్న సమయంలో పశుపతి పేరు చెప్పారు. ఆయన్ని కలిస్తే.. తెలుగు సినిమాల్లో చేయాలనుకోవడం లేదని చెప్పారు. ఆతర్వాత ఆయనే నటిస్తానని ముందుకు వచ్చారు. సుధాకర్‌ కూడా ఈ సినిమాలో ఓ కీ రోల్‌ పోషించారు.

Read latest Cinema News and Telugu News


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్