స్పై యాక్షన్‌ కామెడీతో...

గతేడాది ‘డ్రీమ్‌గర్ల్‌ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్‌ కథానాయకుడు ఆయుష్మాన్‌ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.

Published : 26 Apr 2024 00:44 IST

తేడాది ‘డ్రీమ్‌గర్ల్‌ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్‌ కథానాయకుడు ఆయుష్మాన్‌ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. ‘‘కరణ్‌ జోహార్‌తో తన మొదటి ప్రాజెక్టు కోసం ఆయుష్మాన్‌ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. కామెడీ అంశాలతో కూడిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రానికి ఆకాశ్‌ కౌశిక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కథానాయికగా సారా అలీఖాన్‌తో చర్చలు జరుపుతోంది చిత్రబృందం. మరో రెండు నెలల్లో సెట్స్‌ పైకి వెళ్తుంది. త్వరలో అధికారికంగా ప్రకటిస్తార’’ని సన్నిహితవర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టును కరణ్‌, గునీత్‌ మోంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


థ్రిల్‌ పంచే సహ్య

మౌనిక రెడ్డి ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘సహ్య’. యాస రాకేశ్‌రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జుకంటి, భాస్కర్‌రెడ్డి నిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని ప్రముఖ కథానాయకుడు అర్జున్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న నాయికా ప్రధానమైన సినిమాలు విజయవంతం అవుతున్నాయి. ‘సహ్య’ కూడా మంచి కథతో తెరకెక్కుతోంది. పేరు, పోస్టర్లు బాగున్నాయి. సినిమా ప్రేక్షకుల మెప్పు పొందాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘పురాణాలతో ముడిపడిన థ్రిల్లర్‌ కథా చిత్రమిది. త్వరలోనే టీజర్‌ని విడుదల చేయనున్నామ’’ని తెలిపారు దర్శకుడు. సంజయ్‌కృష్ణ, రవీందర్‌రెడ్డి, సుమన్‌, భాను, నీలేశ్‌, ప్రశాంత్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అరుణ్‌ కోలుగురి, ఛాయాగ్రహణం: రోహిత్‌ జిల్లా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని