Kamal Haasan: పాటల హంగామా..

ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు.

Updated : 26 Apr 2024 11:40 IST

వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. విడుదల తేదీపై స్పష్టత రాకపోయినా... ఆయా సినిమాలు మే నెలని ప్రచారం కోసం ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు రచించాయి. వచ్చే నెలంతా కొత్త సినిమాల పాటల హంగామా కొనసాగనుంది. ఇప్పటికే ‘పుష్ప2’ తొలి పాట విడుదల ఖరారైంది. మే 1న ఆ పాట విడుదలవుతోంది. త్వరలోనే ‘భారతీయుడు2’ తొలి పాటని కూడా విడుదల చేయనున్నారు. ‘దేవర’, ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ తదితర సినిమాలూ పాటల హంగామాని షురూ చేయనున్నట్టు సమాచారం. ఆసక్తికరమైన కలయికల్లో రూపొందుతున్న సినిమాలు కావడంతో, ఆయా పాటలపైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ‘భారతీయుడు 2’ విడుదల జూన్‌లో అని ఇదివరకు చిత్రబృందం ప్రకటించినా, తేదీ ఎప్పుడనేది స్పష్టత లేదు. అయితే ఆ సినిమా విడుదల లోపు, తొలి ‘భారతీయుడు’ రీరిలీజ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం. ఇప్పుడంతా రీ రిలీజ్‌ల ట్రెండ్‌ కొనసాగుతుండడం, త్వరలోనే ‘భారతీయుడు 2’ విడుదల ఉండటంతో ఇదే సరైన సమయమని భావించిన చిత్రబృందం తొలి సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని