Aamir Khan: తారల మెరుపులు షురూ

అగ్ర కథానాయకుడు ఆమిర్‌ఖాన్‌ ‘లాల్‌సింగ్‌ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్‌ పర్‌’పైనే ఉంది. దీన్ని ఆర్‌.ఎస్‌.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు.

Updated : 26 Apr 2024 11:55 IST

గ్ర కథానాయకుడు ఆమిర్‌ఖాన్‌ ‘లాల్‌సింగ్‌ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్‌ పర్‌’పైనే ఉంది. దీన్ని ఆర్‌.ఎస్‌.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. పదహారేళ్ల కిందట వచ్చిన ‘తారే జమీన్‌ పర్‌’కి ఇది సీక్వెల్‌. వచ్చే నెల నుంచి దిల్లీలో చిత్రీకరణ ప్రారంభం కానుందని గురువారం సినీవర్గాలు తెలిపాయి. నెలరోజులపాటు సాగే ఈ షెడ్యూల్‌లో పదకొండు మంది కుర్రాళ్లతో కలిసి ఆమిర్‌ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ సినిమాలో జెనీలియా.. ఆమిర్‌ఖాన్‌కి జోడీగా నటిస్తుండగా.. దర్శీల్‌ సఫారీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఏడాది క్రిస్మస్‌కి విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు