Bigg Boss Telugu 5: ఇది నా డీల్‌.. నా ఇష్టం బ్రదర్‌: శ్రీరామచంద్ర

బిగ్‌బాస్‌ (Bigg boss) హౌస్‌లో సన్నీ-మానస్‌-కాజల్‌ ముగ్గురూ మంచి స్నేహితులనే విషయం అందరికీ తెలిసిందే. ఇంటి సభ్యులపై తమకున్న అభిప్రాయాలను ఎక్కువగా....

Published : 17 Nov 2021 17:31 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ (Bigg boss) హౌస్‌లో సన్నీ-మానస్‌-కాజల్‌ ముగ్గురూ మంచి స్నేహితులనే విషయం అందరికీ తెలిసిందే. ఇంటి సభ్యులపై తమకున్న అభిప్రాయాలను ఎక్కువగా ఈ ముగ్గురే పంచుకుంటారు. అయితే, తాజాగా జరిగిన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ ఈ ముగ్గురు మధ్య విభేదాలకు తావిచ్చేలా సాగింది. కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం నిర్వహించిన బెలూన్స్ పగలగొట్టే గేమ్‌లో ప్రియాంక-మానస్‌ మొదట తలపడ్డారు. ఈ గేమ్‌లో సన్నీ (Sunny).. మానస్‌ని(Maanas) ఎంతగానో సపోర్ట్‌ చేశాడు.

అనంతరం జరిగిన స్విమ్మింగ్‌పూల్‌, టీషర్ట్‌ గేమ్‌లో సన్నీ-మానస్‌ హోరాహోరీగా తలపడ్డారు. ఇందులో భాగంగా స్విమ్మింగ్‌ పూల్‌కి ఇరువైపులా కొన్ని టీషర్ట్స్‌ని ఉంచిన బిగ్‌బాస్‌.. ఈ గేమ్‌లో తలపడే పోటీదారులు మొదట ఓ టీ షర్ట్‌ ధరించి.. అనంతరం పూల్‌లోకి దూకి.. అవతల వైపునకు చేరుకుని అక్కడ ఉన్న టీషర్ట్‌నూ ధరించాలని తెలిపాడు. ఇలా, ఇచ్చిన సమయంలో ఇరువైపులా ఉన్న టీషర్ట్స్‌ని ఎవరు ఎక్కువగా ధరిస్తారో వాళ్లే ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక అవుతారని బిగ్‌బాస్‌ సూచించాడు. దీంతో మానస్‌-సన్నీ పోటాపోటీగా తలపడ్డారు. తాను ధరించిన టీ షర్ట్‌కి లెబుల్‌ లేదంటూ సన్నీ ఆగ్రహానికి గురయ్యాడు. తనకి ఆడాలనే ఉత్సాహం పోయిందన్నారు. ‘‘గేమ్‌ ఆడే హడావుడిలో కూడా లెబుల్‌ ఉన్న టీషర్ట్‌నే ఎంచుకోవాలి. అదే గేమ్‌’’ అని కాజల్‌ (Kajal) వివరించే ప్రయత్నం చేయగా.. ‘‘అది ముందు సరిగ్గా చెప్పాలి. అర్థం కావట్లేదు. ప్రతిసారీ మీరే విజయం సాధించాలనుకుంటున్నారు. కాబట్టి మీరే ఆడుకోండి’’ అంటూ కాజల్‌, మానస్‌లపై విరుచుకుపడ్డాడు. మరి, ఈ పోటీలో ఎవరు విజయం సాధించారో తెలియాలంటే వేచి చూడాల్సిందే..!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని