Cinema News: ఆమె ప్రేమలో అతడు

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’. సునీల్‌, కౌశల్‌, బెనర్జీ ముఖ్యపాత్రధారులు. రవి  కనగాల, రామ్‌ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఝాన్సీ కూనం  

Updated : 25 Oct 2021 07:30 IST

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’. సునీల్‌, కౌశల్‌, బెనర్జీ ముఖ్యపాత్రధారులు. రవి  కనగాల, రామ్‌ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఝాన్సీ కూనం  సమర్పిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకుని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుకొంటోందీ సినిమా. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘నేను దర్శకత్వం వహించిన ‘ఆఖరి పోరాటం’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రాల రచయితైన యండమూరి వీరేంద్రనాథ్‌ దర్శకుడిగా ఇప్పటికే తన ప్రత్యేకతని చాటారు. ‘అతడు ఆమె ప్రియుడు’ ఘన విజయం సాధించి, నిర్మాతలకి మంచి లాభాల్ని తెచ్చిపెట్టాలి. లుక్‌ బాగుంద’’ని మెచ్చుకున్నారు. యండమూరి మాట్లాడుతూ ‘‘కె.రాఘవేంద్రరావు నాకు గురువులాంటివారు. భారతదేశం గర్వించదగిన దర్శకుడు. ఆయన మా సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అంబికారా రాజా, హీరోయిన్‌ మహేశ్వరి, అమర్‌, భూషణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు