
Trisha: హీరోయిన్ త్రిష ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి
చెన్నై: ఒకప్పుడు తెలుగులో అగ్రకథానాయికగా రాణించి ఇప్పుడు కోలీవుడ్‌లో వరుస అవకాశాలతో అలరిస్తున్న నటి త్రిష. మూడుపదుల వయసులో ఉన్న ఈ భామ త్వరలోనే ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్‌తో త్రిష ప్రేమలో పడిందని.. త్వరలో వీళ్లిద్దరూ తమ బంధాన్ని వివాహబంధంగా మార్చుకోనున్నారని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
పెద్దలు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. అతి త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నట్లు సమాచారం. ఆమె నటించిన ఓ చిత్రానికి అతనే డైరెక్టర్‌గా వ్యవహరించారని.. చిత్రీకరణ సమయంలోనే ప్రేమలో పడ్డారని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో త్రిష పెళ్లి గురించే ముచ్చటించుకుంటున్నారు. ఇక, సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె చేతిలో ఐదు కోలీవుడ్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వాటిల్లో ‘పొన్నియిన్ సెల్వన్’ ఒకటి. మరోవైపు గతంలో త్రిషకి వ్యాపారవేత్త వరుణ్‌తో నిశ్చితార్థమైన విషయం తెలిసిందే. అయితే.. మనస్పర్థలు రావడంతో వారి బంధానికి మధ్యలోనే ది ఎండ్ కార్డ్ పడింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.