Mukku Avinash: ఘనంగా ‘ముక్కు’ అవినాష్ వివాహం
‘జబర్దస్త్’ ఫేం ముక్కు అవినాష్ ఓ ఇంటివాడయ్యారు. అనుజతో కలిసి బుధవారం ఆయన వివాహబంధంలోకి అడుగుపెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘జబర్దస్త్’ ఫేం ముక్కు అవినాష్ ఓ ఇంటివాడయ్యారు. అనుజతో కలిసి బుధవారం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. అనుజ మెడలో అవినాష్ తాళికట్టే దృశ్యాల్ని ‘ఆటో’ రామ్ ప్రసాద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘క్షమించు అవినాష్. చాలా పెద్ద తప్పు జరిగింది. నేను సాయం చేయలేకపోయాను’ అని సరదా వ్యాఖ్యని జోడించారు. అవినాష్ అభిమానులు, సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులు నూతన దంపతులకి శుభాకాంక్షలు తెలిపారు. ‘జబర్దస్త్’ కామెడీ షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అవినాష్. పలువురు హీరోల పాత్రల్ని అనుకరించి తనదైన మార్క్ చూపించారు. ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’లోనూ ఆయన సందడి చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Viveka Murder case: ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్న ఎంపీ అవినాష్‌రెడ్డి
-
Movies News
Dasara: ‘బాహుబలి’.. ‘ఆర్ఆర్ఆర్’.. ఇప్పుడు ‘దసరా’!
-
India News
PM Modi: భారత ఆర్థికాభివృద్ధి.. ప్రజాస్వామ్య ఘనతే: ప్రధాని మోదీ
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
Rohit Sharma: ఐపీఎల్లో రోహిత్‌కు విశ్రాంతి.. ముంబయి కోచ్ ఏమన్నాడంటే?
-
Movies News
Anushka Sharma: కాపీరైట్ ఆమెదే.. అనుష్క శర్మ పన్ను కట్టాల్సిందే..!