Laal Singh Chaddha: లాల్‌ అందుకే ముందుకెళ్లాడు?

ఒక్కో హీరోకి ఒక్కో సెంటిమెంట్‌ ఉంటుంది. కొన్ని ప్రత్యేక రోజుల్లో తమ సినిమాలు విడుదల కావాలనుకుంటారు. ఏళ్ల తరబడి అదే కొనసాగిస్తారు. విజయాలు సాధిస్తుంటారు. ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు ఆమిర్‌...

Published : 30 Sep 2021 10:20 IST

ఒక్కో హీరోకి ఒక్కో సెంటిమెంట్‌ ఉంటుంది. కొన్ని ప్రత్యేక రోజుల్లో తమ సినిమాలు విడుదల కావాలనుకుంటారు. ఏళ్ల తరబడి అదే కొనసాగిస్తారు. విజయాలు సాధిస్తుంటారు. ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు ఆమిర్‌ ఖాన్‌ చిత్రాలు కూడా క్రిస్మస్‌కు సందడి చేస్తుంటాయి. ఈసారి తన ‘లాల్‌ సింగ్‌ ఛద్దా’ చిత్రాన్ని అప్పుడే విడుదల చేయాలనుకున్నారు. థియేటర్ల కోసం ఇన్నాళ్లు ఎదురుచూశారు. ఆశించినట్టుగానే మహారాష్ట్రలో వచ్చే నెల్లో థియేటర్లు తెరచుకోనున్నాయి. కానీ లాల్‌.. అనుకున్న    సమయానికి రావడం లేదు. వచ్చే ఏడాది ప్రేమికుల రోజు కానుకగా ఈ చిత్రం రానుంది. ఈ ఏడాది డిసెంబరు చివరి వారంలో పలు భారీ బడ్జెట్‌ చిత్రాలు విడుదల కానున్నాయి. డిసెంబరు 24న ‘83’, డిసెంబరు 31న ‘జెర్సీ’, ‘సర్కస్‌’ చిత్రాలు విడుదలవుతున్నాయి. దాంతో ఆమిర్‌ చిత్రం వచ్చే ఏడాదికి వెళ్లింది. ‘‘థియేటర్లు తెరచుకోనుండటంతో దర్శకనిర్మాతలు ఉత్సాహంగా విడుదల తేదీలు ప్రకటిస్తున్నారు. అదే సమయంలో ఓ పద్ధతి ప్రకారం చిత్రాల్ని విడుదల చేస్తున్నారు. కొన్ని చిత్రాలు చాలా రోజులుగా థియేటర్లలో   విడుదల కోసం వేచి చూస్తున్నాయి. ముందు వాళ్లకు అవకాశం ఇచ్చి తర్వాత మిగిలినవి విడుదల చేద్దాం అనే సామరస్య పూర్వక వాతావరణం బాలీవుడ్‌లో కనిపిస్తుంది’’అని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాతల మధ్య అవగాహనలో భాగంగానే లాల్‌..విడుదల వచ్చే ఏడాదికి వెళ్లినట్టు తెలుస్తోంది. కరీనా కపూర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య ఓ కీలక పాత్రలో సందడి చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని