
manchu lakshmi: ఛాన్స్ దొరికితే చాలు.. కామెంట్ చేసేస్తారేంటో..!
మంచులక్ష్మి ఫైర్
హైదరాబాద్: ఎదుటివాళ్ల మాటను అర్థం చేసుకోకుండా.. ఛాన్స్ దొరికితే చాలు కామెంట్ చేయడానికి కొంతమంది సిద్ధంగా ఉంటారని నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోదరుడు మంచు విష్ణుపై ఆమె చేసిన ఓ ట్వీట్‌పై పలువురు కామెంట్లు చేస్తున్నారు. వీటిపై తాజాగా ఆమె స్పందించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించి ‘మా’ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్షుడిగా తన సోదరుడు ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకోవాలని ఆశిస్తూ లక్ష్మి అదేరోజు ట్వీట్ చేశారు.
‘ఈరోజు మా కుటుంబానికి అత్యంత శుభదినం!! నా సోదరుడు విష్ణు.. ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం. ప్రపంచాన్ని మార్చడానికి ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించనున్న కొత్త ప్రయాణానికి ఆల్ ది బెస్ట్. నాకెంతో గర్వంగా ఉంది. నువ్వు ఎలాంటి మార్పులు చేయనున్నావోనని చూస్తున్నాను’ అని మంచు లక్ష్మి మొదట ట్వీట్ చేశారు. అయితే, ఆమె ట్వీట్‌పై నెటిజన్లు పంచులు వేయడం ప్రారంభించారు. ‘‘మా’ అధ్యక్షుడు మొత్తం ప్రపంచాన్ని ఎలా మార్చగలడు?’’ అంటూ వరుస పంచులు వేశారు.
కాగా, తాజాగా నెటిజన్ల కామెంట్లపై లక్ష్మి ఫైర్ అయ్యారు. ‘‘ఇక ఆపండి!! ఎప్పుడు ఛాన్స్ వస్తుందా.. ఎవర్ని కామెంట్ చేద్దామా.. అని చూస్తుంటారు. నటీనటులకు సినిమానే ఓ ప్రపంచం. కాబట్టి, నా ఉద్దేశం ప్రకారం మీరు అనుకునేలా ప్రపంచాన్ని మార్చడం కాదు.. మా అసోసియేషన్ ప్రపంచాన్ని మార్చడం.. ఈ విషయాన్ని కొంచెం అర్థం చేసుకోండి’ అని ఆమె క్లారిటీ ఇచ్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
-
India News
Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
-
Viral-videos News
Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
-
India News
Sidhu Moose Wala: సిద్ధూ మూసేవాల కేసులో షార్ప్‌షూటర్ అరెస్టు
-
Sports News
IND vs ENG: శ్రేయస్‌ను తెలివిగా బుట్టలో వేసిన ఇంగ్లాండ్.. వీడియో చూడండి
-
Movies News
Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
- IND vs ENG: నాలుగో రోజు ముగిసిన ఆట.. భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సిందే!
- మొత్తం మారిపోయింది
- Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
- Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
- Maharashtra: ఉద్ధవ్ వైపే ఉంటానని కన్నీరు పెట్టుకొని.. శిందేకు ఓటేశారు!