Cinema News: మలుపుల ‘పాయిజన్‌’

రమణ కథానాయకుడిగా రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెర  కెక్కిన చిత్రం ‘పాయిజన్‌’. శిల్పిక.కె నిర్మాత. తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు

Updated : 27 Nov 2021 07:51 IST

రమణ కథానాయకుడిగా రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెర  కెక్కిన చిత్రం ‘పాయిజన్‌’. శిల్పిక.కె నిర్మాత. తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ట్రైలర్‌ని విడుదల చేశారు. ఒక కథలో ఇన్ని ట్విస్టులా? అనే సంభాషణ ట్రైలర్‌లో వినిపిస్తుంది. ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘హాలీవుడ్‌ సినిమాని తలపించేలా ఉంది ట్రైలర్‌ చూస్తుంటే. ఈ నిర్మాతలకి సినిమా అంటే ప్రాణం. కథానాయకుడు రమణకి మంచి భవిష్యత్తు ఉంది. యువతరానికి ఈ సినిమా బాగా నచ్చుతుంద’’న్నారు. ‘‘భాషతో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్‌ అయ్యే అంశాలున్న కథ ఇది. అడుగడుగునా వచ్చే మలుపులు ఉత్కంఠని రేకెత్తిస్తాయి. కథానాయకుడు చాలా బాగా నటించాడు. ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని తీశారు నిర్మాత. తప్పకుండా   ప్రేక్షకుల్ని మెప్పిస్తాం’’ అన్నారు దర్శకుడు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు పుప్పాల రమేష్‌, సాయివెంకట్‌, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని