Ramcharan 15: ఆర్‌సీ 15 షురూ.. క్లాప్‌ కొట్టిన చిరంజీవి..

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ కొత్త సినిమా పట్టాలెక్కింది. ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది.....

Updated : 08 Sep 2021 15:18 IST

హైదరాబాద్‌: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ కొత్త సినిమా పట్టాలెక్కింది. ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతోపాటు పలువురు స్టార్‌ సెలబ్రిటీలు సందడి చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి, బాలీవుడ్‌ స్టార్‌హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఈ వేడుకలో పాల్గొని టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ముహూర్తపు షాట్‌లో భాగంగా చిరంజీవి తన తనయుడు రామ్‌చరణ్‌పై క్లాప్‌ కొట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది. చరణ్‌ ప్రభుత్వాధికారి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. చరణ్‌కు జోడీగా కియారా సందడి చేయనున్నారు. అంజలి, జయం రవి, శ్రీకాంత్‌, సునీల్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తమన్‌ స్వరాలు అందించనున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని