Sridevi Drama Company: ‘నాకు దూరంగా ఉండు’.. సుధీర్‌కి పంచ్‌ విసిరిన మహేశ్వరి

తనకు దూరంగా ఉండాలంటూ సుధీర్‌కి నటి మహేశ్వరి కౌంటర్‌ ఇచ్చారు.

Updated : 29 Dec 2021 09:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనకు దూరంగా ఉండాలంటూ నటి మహేశ్వరి.. సుధీర్‌కి కౌంటర్‌ ఇచ్చారు. సుధీర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమానికి ఆమె అతిథిగా విచ్చేసి సందడి చేశారు. మహేశ్వరిని ఆహ్వానిస్తూ సుధీర్‌ ఆమెతో చెయ్యి కలిపే ప్రయత్నం చేశాడు. ‘హాయ్‌’కి బదులు ఆమె తెలివిగా నమస్కారం చేశారు. ‘‘ఇదేంటి నేను హాయ్‌ చెప్తే మీరు నమస్కారం పెడుతున్నారు?’’ అని సుధీర్‌ ప్రశ్నించగా ‘వద్దు బాబూ..! నేను చెయ్యి కలిపితే నువ్వు పులిహోర కలుపుతావ్‌’ అంటూ మహేశ్వరి పంచ్‌తో నవ్వులు పూయించారు. ఆ తర్వాత, ‘‘మేడమ్‌.. నన్ను ఎక్కడ ఉండమంటారు?’’ అని సుధీర్‌ అడిగిన ప్రశ్నకు ‘నా నుంచి మాత్రం దూరంగా ఉండు’ అంటూ ఆమె పంచ్‌ విసిరారు. ఈ ఇద్దరి సంభాషణలకు షోలో ఉన్నవారంతా కడుపుబ్బా నవ్వారు.

‘ఈటీవీ’ వేదికగా ప్రేక్షకులకు ప్రతి ఆదివారం పసందైన వినోదాన్ని అందించే కార్యక్రమం ఇది. ఎప్పటిలాగే ఈవారం ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమైంది. సంబంధిత ఎపిసోడ్‌ ప్రోమో నెట్టింట విడుదలై సందడి చేస్తోంది. ‘స్వర్గంలో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌’ పేరిట రూపొందిన ఈ ప్రత్యేక ఎపిసోడ్‌కు మహేశ్వరి అతిథిగా వచ్చారు. డ్యాన్స్‌తో బుల్లితెర నటులు, సింగింగ్‌తో నూకరాజు- ఇమ్మాన్యుయేల్‌ విశేషంగా ఆకట్టుకున్నారు. ఆది కామెడీ ఎప్పటిలానే అలరించింది. అనంతరం, ఇదే వేదికపై కొందరు అంధులకు నూకరాజు, ఇమ్మాన్యుయేల్‌ తదితరులు ఆర్థిక సాయం ప్రకటించారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని