Thandel: ఇక రాజులమ్మ జాతరే

‘గుర్తెట్టుకో.. ఈపాలి యాట గురి తప్పేదేలేదేస్‌...’ అంటున్నారు నాగచైతన్య. ఇదంతా ‘తండేల్‌’ కోసమే! నాగచైతన్య కథానాయకుడిగా... చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది.

Updated : 07 Jan 2024 09:34 IST

గుర్తెట్టుకో.. ఈపాలి యాట గురి తప్పేదేలేదేస్‌...’ అంటున్నారు నాగచైతన్య. ఇదంతా ‘తండేల్‌’ కోసమే! నాగచైతన్య కథానాయకుడిగా... చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. సాయిపల్లవి కథానాయిక. గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పకులు. ఈ సినిమా కథా ప్రపంచాన్ని ఓ వీడియోతో శనివారం ఆవిష్కరించింది చిత్రబృందం. ‘ఇక రాజులమ్మ జాతరే..., బుగ్గిలేపి దుల్లకొట్టేస్తా...’ అంటూ నాగచైతన్య ఉత్తరాంధ్ర యాసలో చేసిన సందడి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఒక జాలరి ప్రేమకథకి.. దేశభక్తి అంశాల్నీ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాకిస్థాన్‌లో బందీ అయిన జాలరిగా నాగచైతన్య కనిపిస్తారు. కథానాయకుడు బుజ్జితల్లి అని పిలుచుకునే అతని ప్రియురాలిగా సాయిపల్లవి కనిపించనుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌దత్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కూర్పు: నవీన్‌ నూలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని