Thandel: తండేల్‌ చిత్రీకరణ షురూ

నాగచైతన్య కథానాయకుడిగా గీతా ఆర్ట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ‘తండేల్‌’ రెగ్యులర్‌  చిత్రీకరణ  మొదలైంది. కర్ణాటకలోని ఉడిపి మల్పే పోర్ట్‌లో పోరాట ఘట్టాలతో చిత్రీకరణని ప్రారంభించినట్టు సినీవర్గాలు తెలిపాయి.

Updated : 21 Dec 2023 09:35 IST

నాగచైతన్య కథానాయకుడిగా గీతా ఆర్ట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ‘తండేల్‌’ రెగ్యులర్‌  చిత్రీకరణ  మొదలైంది. కర్ణాటకలోని ఉడిపి మల్పే పోర్ట్‌లో పోరాట ఘట్టాలతో చిత్రీకరణని ప్రారంభించినట్టు సినీవర్గాలు తెలిపాయి. నాగచైతన్య సరసన సాయిపల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాస్‌ నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పకులు. నాగచైతన్య మత్స్యకారుడిగా సందడి చేయనున్నారు. ‘‘యథార్థ సంఘటనల ఆధారంగా..  భిన్నమైన నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. నాగచైతన్య గెటప్‌ ప్రత్యేకంగా ఉంటుంది. అత్యున్నత సాంకేతిక హంగులతో చిత్రం రూపొందుతోంద’’ని సినీవర్గాలు తెలిపాయి. సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కళ: శ్రీనాగేంద్ర తంగాల, ఛాయాగ్రహణం: షామ్‌దత్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని