Trisha:సల్మాన్‌ సరసన త్రిష?

‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’, ‘లియో’ లాంటి చిత్రాలతో ఈ ఏడాది భారీ విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది అగ్రకథానాయిక త్రిష. దక్షిణ అగ్రతారలలో ఒకరిగా దూసుకుపోతున్న ఈమె అదిరిపోయే నటనతో మెప్పిస్తోంది.

Updated : 01 Jan 2024 09:33 IST

పొన్నియిన్‌ సెల్వన్‌ 2’, ‘లియో’ లాంటి చిత్రాలతో ఈ ఏడాది భారీ విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది అగ్రకథానాయిక త్రిష. దక్షిణ అగ్రతారలలో ఒకరిగా దూసుకుపోతున్న ఈమె అదిరిపోయే నటనతో మెప్పిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకులను అలరించిన త్రిష కామెడీ చిత్రం ‘ఖట్టా మీఠా’తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్‌తో సందడి చేసిన త్రిష ఇప్పుడు సల్మాన్‌ ఖాన్‌తో ‘ది బుల్‌’ అనే చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. దాదాపు 13ఏళ్ల తర్వాత తిరిగి హిందీ పరిశ్రమలో ఈమె అడుగుపెట్టనుందని తెలుస్తోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాని విష్ణు విర్ధన్‌ తెరకెక్కించనున్నారు. కరణ్‌ జోహార్‌ నిర్మాత. ‘ఖట్టా మీఠా’ తర్వాత హిందీలో అవకాశాలు వచ్చినా దక్షిణాది సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ ఆఫర్స్‌ని తిరస్కరించిందని, ఇప్పుడు ఈ చిత్రంలో నటించే ఛాన్స్‌ రావడంతో త్రిష ఆసక్తి చూపుతుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. 25ఏళ్ల అనంతరం సల్మాన్‌, కరణ్‌ కాంబోలో రానున్న ఈ ప్రాజెక్టుపై చిత్రవర్గాలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు అందులో త్రిష కనిపించనుందన్న వార్తలు ప్రేక్షకుల అంచనాలను తారాస్థాయికి పెంచాయి. ప్రస్తుతం త్రిష ‘విదా ముయార్చి’, ‘ఐడెంటిటీ’ సినిమాల చిత్రీకరణలో బిజీగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని