NANI.. యాంకర్‌ని ఆటపట్టించిన నటుడు

నేచురల్‌స్టార్‌ నాని.. ప్రముఖ వ్యాఖ్యాత సుమని సరదాగా ఆటపట్టించారు. ‘సుమ ఆంటీ’ అంటూ పిలిచారు. సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న....

Published : 16 May 2021 11:30 IST

వైరల్‌గా మారిన వీడియో

హైదరాబాద్‌: నేచురల్‌స్టార్‌ నాని.. ప్రముఖ వ్యాఖ్యాత సుమని సరదాగా ఆటపట్టించారు. ‘సుమ ఆంటీ’ అంటూ పిలిచారు. సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘క్యాష్‌’ షోలో తాజాగా ‘టక్‌ జగదీశ్‌’ చిత్రబృందం సందడి చేసింది. నటీనటులు నాని-రీతూవర్శతోపాటు చిత్రదర్శకుడు శివ నిర్వాణ ‘క్యాష్‌’లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా సుమ మాట్లాడుతూ.. ‘అమ్మాయిలకు ఆంటీ అని పిలిస్తే నచ్చదు’ అని అంటే నాని ఆమెను ఆటపట్టిస్తారు. ‘ఈరోజు సుమ ఆంటీ షోకి రావడం నాకెంతో ఆనందంగా ఉంది. సుమ ఆంటీకి నేను వీరాభిమానిని. సుమ ఆంటీ అంటే నాకెంతో ఇష్టం’ అని సరదాగా అంటారు. అంతేకాకుండా.. ‘ఆంటీ అని ఇకపై పిలవనని కేవలం సుమ పిన్ని అంటాను’ అని వరుస పంచులు వేశారు. మరోవైపు, సుమ-శివ నిర్వాణల సరదా సెటైర్లతో క్యాష్‌ షో ఆద్యంతం జోష్‌ఫుల్‌గా మారింది. అయితే, ఇలాంటి ఎన్నో సరదా విశేషాలతో సాగిన ఈ పూర్తి ఎపిసోడ్‌ చూడాలంటే మే 22వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని