Upcoming Movies: ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే!

Upcoming Movies: దసరా సందర్భంగా పెద్ద సినిమాలు థియేటర్‌ వద్ద సందడి చేశాయి. ఈ క్రమంలో అక్టోబరు చివరి వారంలో మళ్లీ చిన్న చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం బాక్సాఫీస్‌ ముందుకు వస్తున్న సినిమాలతో పాటు, ఓటీటీలోనూ అలరించే సినిమాలేంటో చూసేయండి.

Updated : 28 Oct 2023 11:12 IST

ఓటరే కింగ్‌ అని చెప్పే.. ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’

సంపూర్ణేష్‌బాబు (sampoornesh babu) కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ (martin luther king). పూజ కొల్లూరు దర్శకురాలు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘మండేలా’ చిత్రానికి ఇది రీమేక్‌. పొలిటికల్‌ సెటైరికల్‌ మూవీగా రూపొందిన ఈ సినిమా అక్టోబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.  వి.కె.నరేశ్‌, వెంకటేశ్‌ మహా, శరణ్య ప్రదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘ప్రజాస్వామ్యంలో ఓటు విలువని చెబుతూనే... ఓటరే అసలు సిసలు కింగ్‌ అని చాటుతుందీ చిత్రం’ అని చిత్ర బృందం చెబుతోంది.


సైనికుల భావోద్వేగ ప్రయాణమిది

దేశభక్తి, తెగువ ఉన్న యుద్ధ విమాన పైలట్‌ తేజస్‌ గిల్‌. కంగనా రనౌత్‌ (kangana ranaut) టైటిల్‌ పాత్ర పోషిస్తున్న ఆ చిత్రమే ‘తేజస్‌’ (Tejas). సర్వేశ్‌ మేవారా దర్శకుడు. భారతీయ వైమానిక దళం పాకిస్థాన్‌లో చేపట్టే ఒక రహస్య ఆపరేషన్‌లో పాల్గొనే పైలట్‌గా కనిపించనుంది కంగన.  రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 27న థియేటర్లలోకి వస్తోంది.


వారం ఆలస్యంగా తెలుగులో..

కన్నడ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌(Shiva Rajkumar) నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఘోస్ట్‌’ (Ghost). శ్రీని దర్శకుడు. సందేశ్‌ నాగరాజ్‌ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్టోబరు 27న తెలుగులోనూ రానుంది. ‘ఆసక్తికరమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందుతోన్న చిత్రమిది. స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్‌ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’ అని చిత్ర బృందం చెబుతోంది. మరి ఈ ఘోస్ట్‌ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.


ఓటు విలువ చెప్పే మరో చిత్రం..

హృతిక్‌ శౌర్య, తన్వి నేగి జంటగా రవి తెరకెక్కించిన చిత్రం ‘ఓటు’ (Vote). చాలా విలువైనది.. అన్నది ఉపశీర్షిక. ఫ్లిక్‌ నైన్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మించింది. గోపరాజు రమణ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా కూడా అక్టోబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/సిరీస్‌లు

  • నెట్‌ఫ్లిక్స్‌
  • లైఫ్‌ ఆన్‌ ఔర్‌ ప్లానెట్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌) అక్టోబరు 25
  • చంద్రముఖి 2 (తమిళ్‌/తెలుగు) అక్టోబరు 26

  • పెయిన్‌ హజ్లర్స్‌ (హాలీవుడ్) అక్టోబరు 27
  • అమెజాన్‌ ప్రైమ్‌
  • ఆస్పిరెంట్స్‌ (హిందీ సిరీస్‌2) అక్టోబరు 25
  • ట్రాన్స్‌ఫార్మార్స్‌ (హాలీవుడ్) అక్టోబరు 26
  • కాన్‌సిక్రేషన్‌ (హాలీవుడ్) అక్టోబరు 27
  • కాస్టావే దివా (కొరియన్‌) అక్టోబరు 28
  • జీ5
  • దురంగా (వెబ్‌సిరీస్‌2) అక్టోబరు 24
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • మాస్టర్‌ పీస్‌ (మలయాళం/తెలుగు) అక్టోబరు 24
  • కాఫీ విత్‌ కరణ్‌ (టీవీ షో8) అక్టోబరు 26
  • ఆహా
  • పరంపోరుళ్‌ (తమిళ) అక్టోబరు 24
  • బుక్‌ మై షో
  • నైట్స్‌ ఆఫ్‌ ది జోడియాక్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 24
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని