Varun Tej: హైదరాబాద్‌లో పెళ్లి చేసుకోవడం ఇష్టం కానీ: వరుణ్‌ తేజ్‌

తాను ఎప్పుడు? ఎక్కడ? వివాహం చేసుకోవాలనుకుంటున్నారో హీరో వరుణ్‌తేజ్‌ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిపై స్పందించారు.

Published : 18 Aug 2023 21:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటులు వరుణ్‌ తేజ్‌ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నిశ్చితార్థం జరిగిన క్షణం నుంచే వారి పెళ్లి ఎప్పుడు? ఎక్కడ చేసుకుంటారు? అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో.. ఈ ఏడాది చివర్లో వారి వివాహం జరిగే అవకాశం ఉందంటూ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ విషయంపై వరుణ్‌తేజ్‌ స్పష్టత ఇచ్చారు. తన కొత్త చిత్రం ‘గాండీవధారి అర్జున’ ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై స్పందించారు. ‘‘మా వివాహం నవంబరు లేదా డిసెంబరులో ఉండొచ్చు. హైదరాబాద్‌లో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం. కానీ, ప్రైవేట్‌ వ్యవహారంగా ఉంచాలనుకోవడం వల్ల అది ఇక్కడ సాధ్యంకాదు. దాంతో, డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేస్తున్నాం. దానికోసం ఇండియాలోని మూడు ప్రాంతాలు, విదేశాల్లో రెండు ప్రాంతాలను పరిశీలిస్తున్నాం. వీటిలో ఒక ప్రాంతాన్ని త్వరలోనే ఎంపిక చేస్తాం’’ అని తెలిపారు.

చిరంజీవిని విమర్శిస్తే బాధగా ఉంది: కార్తికేయ

దాదాపు ఐదేళ్ల నుంచి తామిద్దరూ స్నేహితులమని, తానే మొదట ప్రపోజ్‌ చేశానని వరుణ్‌ తేజ్‌ మరో ఇంటర్వ్యూలో చెప్పారు. తాను వాడుతున్న ఫోన్‌ను లావణ్య గిఫ్ట్‌గా ఇచ్చిందని అన్నారు. ‘మిస్టర్‌’ కోసం తొలిసారి లావణ్య- వరుణ్‌ కలిసి నటించారు. ఆ సినిమా ప్రయాణంలోనే వీరిద్దరూ స్నేహితులయ్యారు. ‘అంతరిక్షం 9000 కేఎమ్‌పీహెచ్‌’ సినిమాలోనూ కలిసి నటించారు. జూన్‌ 9న వీరి నిశ్చితార్థం జరిగింది. ‘గాండీవధారి అర్జున’ (Gaandeevadhari Arjuna) సినిమా విషయానికి వస్తే.. ప్రవీణ్‌ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్‌ బాడీగార్డ్‌గా నటించారు. సాక్షి వైద్య (Sakshi Vaidya) కథానాయిక. వాతావరణంలో వచ్చే మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల జరిగే నష్టాల గురించి ఈ సినిమాలో చూపించనున్నారు. విమలా రామన్‌, వినయ్‌ రామ్‌, రోషిణి ప్రకాశ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్‌, లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న (Gaandeevadhari Arjuna Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు