Vidyut Jammwal: నగ్న ఫొటోలు షేర్‌ చేసిన హీరో.. ప్రతి సంవత్సరం ఇలా 10రోజులంటూ పోస్ట్‌

బాలీవుడ్‌ హీరో విద్యుత్‌ జమ్వాల్‌ తన నగ్న ఫొటోలతో అభిమానులు, నెటిజన్లను షాక్‌కు గురిచేశారు. ఆయన ఎందుకలా చేశారంటే?

Published : 10 Dec 2023 17:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొందరు సినీ నటులు తమ పుట్టినరోజును కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో కలిసి అట్టహాసంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఇంకొందరు అభిమానులతో కలిసి వేడుక చేసుకునేందుకు ఇష్టపడతారు. మరికొందరు పార్టీలకు, సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉంటారు. ఇలాంటి వారిలో బాలీవుడ్‌ హీరో విద్యుత్‌ జమ్వాల్‌ (Vidyut Jammwal) ఒకరు. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిచ్చే ఆయన ప్రకృతి చెంతన గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఆ క్రమంలోనే హిమాలయాలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దిగిన ఫొటోలను తన పుట్టినరోజు సందర్భంగా  సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అందులో ఆయన నగ్నంగా కనపడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వాటిలో ఆయన.. ఒంటిపై నూలు పోగు లేకుండా నదిలో ధ్యానం చేయడం, ఓ చెట్టుకింద వంట చేసుకోవడం కనిపించింది.

‘బాహుబలి’గా అర్జున్‌.. ‘చంద్రముఖి’గా శోభ.. ఫొటోలు చూశారా?

‘‘హిమాలయాల నుంచి తిరుగు ప్రయాణం. 14 ఏళ్లుగా ఇలా గడపడం నా జీవితంలో భాగమైంది. ఏడాదిలో 7-10 రోజులు ఇక్కడ సంచరిస్తుంటా. విలాసవంతమైన జీవితం నుంచి బయటకు వచ్చి ప్రకృతికి దగ్గరైతే నా గురించి నేను తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఇలా నేనెవరో.. నా బలాబలాలేంటో పరిశీలించుకునే క్రమాన్ని బాగా ఇష్టపడతా. నా కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకురావడం నాకు సౌకర్యంగానే ఉంటుంది. నేచుర్‌ ఫ్రీక్వెన్సీకి నేను ట్యూన్‌ అవుతా. నన్ను నేను ప్రకృతి శక్తిని గ్రహించే యాంటీనాగా ఊహించుకుంటా. ఇతరులకు ఆనందం, ప్రేమను పంచుతుంటా. నాకు కావాల్సిన శక్తిని ఆ ప్రకృతి చెంతన తీసుకుని, ఆ తర్వాత ఇంటికి తిరిగి వస్తా. అనుభవపూర్వకంగానే ఏకాంతం, ప్రకృతి గొప్పదనం గురించి తెలుస్తుంది. కొత్త అధ్యాయానికి నేను సిద్ధంగా ఉన్నా. నా కొత్త సినిమా ‘క్రాక్‌’ 2024 ఫిబ్రవరి 23న విడుదలవుతుంది’’ అని విద్యుత్‌ జమ్వాల్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనిపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. ‘‘గ్రీకు దేవుడిలా కనిపిస్తున్నారు. మీకు సెల్యూట్‌’’ అని ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. విద్యుత్‌ పోస్ట్‌పై పలువురు నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ బాలీవుడ్‌ హీరో తెలుగు చిత్రం ‘శక్తి’తో తెరంగేట్రం చేశారు. ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో విద్యుత్‌ ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. ఆ తర్వాత ఇదే కాంబినేషన్‌లో ‘ఊసరవెల్లి’ వచ్చింది. ‘బిల్లా 2’, ‘తుపాకి’ తదితర సినిమాల్లోనూ విలన్‌గా నటించి కోలీవుడ్‌లో క్రేజ్‌ సంపాదించుకున్నారు. ‘ది పవర్‌’, ‘కమాండో 2’, ‘కమాండో 3’ తదితర హిందీ చిత్రాల్లో హీరోగా అలరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని