Bigg Boss Telugu 7: ‘బాహుబలి’గా అర్జున్‌.. ‘చంద్రముఖి’గా శోభ.. ఫొటోలు చూశారా?

Updated : 10 Dec 2023 17:29 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-7 (Bigg Boss Telugu 7) ముగింపు దశకు వచ్చేసింది. మిగిలిన రోజులతో పోలిస్తే, ఆట పాటలతో వీకెండ్‌ ఎపిసోడ్స్‌ మరింత వినోదాన్ని పంచుతుంటాయి. ఈ క్రమంలో ఆదివారం ఎపిసోడ్‌ కూడా వినోదాల విందును అందించడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో సినిమా పేరు అభినయంతో ఒక కంటెస్టెంట్‌ చూపిస్తే, ఆ టైటిల్‌ ఏంటో మిగిలిన వాళ్లు చెప్పాలనే గేమ్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అలా సినిమాకు తగినట్లు అందులో ప్రధాన పాత్రలను హౌస్‌లో ఉన్న వారి డిజైన్‌ చేసి బిగ్‌బాస్‌ టీమ్‌ చూపించింది. ‘బాహుబలి’లో ప్రభాస్‌గా అర్జున్‌, ‘మహానటి’లో సావిత్రిగా ప్రియాంక, ‘చంద్రముఖి’లో జ్యోతికలా శోభ, ‘అపరిచితుడు’లో విక్రమ్‌గా పల్లవి ప్రశాంత్‌, ‘గజనీ’లో సూర్యగా అమర్‌ కనిపించారు. దీంతో నవ్వులు వెల్లివిరిశాయి. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని