Vijay Deverakonda: గూఢచారిగా విజయ్ దేవరకొండ
యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఖరారైంది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఆ సినిమా రూపొందనుంది.
యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కొత్త సినిమా ఖరారైంది. ‘జెర్సీ’ (Jersey) ఫేమ్ గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో ఆ సినిమా రూపొందనుంది. విజయ్ దేవరకొండ 12వ చిత్రమిది. ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. సంక్రాంతి పండగని పురస్కరించుకుని శుక్రవారం ఈ కలయికలోని సినిమాని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్న విజయ్ దేవరకొండ... ‘లైగర్’ తర్వాత ఒప్పుకున్న చిత్రమిదే. ఇందులో విజయ్ ఓ అజ్ఞాత గూఢచారిగా కనిపించనున్నట్టు చిత్రబృందం విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్‌ని బట్టి స్పష్టమవుతోంది. ‘‘విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కలయికలో రూపొందుతున్న ఈ సినిమా అంచనాల్ని అధిగమించేలా ఉంటుంది. ఓ అద్భుతమైన విషయం ఇందులో ఉంటుంది’’ అన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ చిత్రంతో విజయ్ నటనలోని ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తానని దర్శకుడు చెప్పారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుందని, త్వరలోనే ఇతర నటులు - సాంకేతిక బృందం వివరాల్ని ప్రకటిస్తామని సినీ వర్గాలు వెల్లడించాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Uttarakhand: కొండచరియల బీభత్సం.. చిక్కుకుపోయిన 300 మంది ప్రయాణికులు
-
Politics News
YSRCP: కర్రసాము చేస్తూ కిందపడిన వైకాపా ఎమ్మెల్యే
-
Crime News
Kamareddy: ఆపరేషన్ థియేటర్లో ఏసీ నుంచి మంటలు
-
Sports News
Mohit Sharma: ఆ రాత్రి నిద్రపట్టలేదు.. నా ప్లాన్ అదే కానీ మిస్‌ఫైర్ అయింది: మోహిత్
-
World News
Kim Jong Un: కిమ్ బరువు 140 కిలోలు.. తీవ్ర నిద్రలేమితో అవస్థలు..!
-
Movies News
Chinmayi: పెళ్లంటూ చేసుకుంటే చిన్మయినే చేసుకోవాలని అప్పుడే అనుకున్నా: రాహుల్ రవీంద్రన్