‘సకల గుణాభి రామ’ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌: సన్నీ

‘సకల గుణాభిరామ’ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు కథానాయకుడు సన్నీ. శ్రీనివాస్‌ వెలిగొండ దర్శకత్వంలో ఆషిమాతో కలిసి ఆయన

Published : 13 Sep 2022 17:10 IST

హైదరాబాద్‌: ‘సకల గుణాభిరామ’ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు కథానాయకుడు సన్నీ. శ్రీనివాస్‌ వెలిగొండ దర్శకత్వంలో ఆషిమాతో కలిసి ఆయన నటించిన చిత్రమిది. ఎస్‌.కె.ఎమ్‌.ఎల్‌ మోషన్‌ పిక్చర్స్‌పతాకంపై ఆదినారాయణఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ నటులు సోహైల్‌, మానస్‌, జెస్సీ, హమీద, యాంకర్‌ రవి తదితరులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు.

‘ఇలాంటి చిన్న చిత్రాలు విజయవంతమైతే మరిన్ని మంచి చిత్రాలు మీ ముందుకు వస్తాయి. అందరూ మా సన్నీ నటించిన సకల గుణాభి రామ చిత్రాన్ని చూసి విజయవంతం చేయండి’ అని సోహైల్‌ కోరాడు. ‘ఇది కంటెంట్ ఉన్న చిత్రం, ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’అని నటుడు మానస్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

‘నేను బిగ్ బాస్ లో రాక ముందే నాకు హీరో గా అవకాశం ఇచ్చిన మా నిర్మాత సంజీవ్ గారికి నా కృతజ్ఞతలు. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. నాకు హీరో గా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీనివాస్ గారికి నా ధన్యవాదాలు. సోహైల్ చాలా సపోర్ట్ ఇచ్చాడు. తనకు అద్భుతమైన టాలెంట్ ఉంది. తన చిత్రాలు మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను. మానస్ నా ప్రాణ మిత్రుడు తన చిత్రాలు కూడా హిట్ కావాలి. మా చిత్రాన్ని 100 థియేటర్స్ లో విడుదల చేస్తున్న అది నారాయణ గారికి నా ధన్యవాదాలు. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేశాం. ప్రేక్షకులు అందరూ మా సినిమా ని చూసి హిట్ చేస్తారు’ అని కథానాయకుడు సన్నీ ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు