Bollywood: ఈసారి ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’

‘వెల్‌కమ్‌’ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలు ప్రేక్షకులకు వినోదాలు పంచాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో మూడో చిత్రానికి ఎప్పటి నుంచో సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత ఫిరోజ్‌ నడియాడ్‌వాలా.

Updated : 17 Dec 2022 11:48 IST

‘వెల్‌కమ్‌’ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలు ప్రేక్షకులకు వినోదాలు పంచాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో మూడో చిత్రానికి ఎప్పటి నుంచో సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత ఫిరోజ్‌ నడియాడ్‌వాలా. ఆయన తాజాగా ఈ సినిమా పేరుపై ఓ స్పష్టత ఇచ్చారు. ‘‘ఈ సినిమాకి ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’ (Welcome To The Jungle) పేరు పెట్టడమే సరైంది అనిపిస్తుంది. మిలటరీ నేపథ్యంగా సాగే యాక్షన్‌ చిత్రమిది. యాక్షన్‌కు చాలా ఎక్కువ ప్రాధాన్యం ఉంది. దీని కోసం ప్రత్యేక హెలికాప్టర్‌లను కూడా ఉపయోగించనున్నాం. భారతీయ తెరపై ఇప్పటివరకూ చూడని కొత్త యాక్షన్‌ సన్నివేశాలను ఇందులో చూస్తారు. ఈ సినిమా 70 శాతం అడవిలోనే తెరకెక్కనుంది’’అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఫిరోజ్‌. తొలి చిత్రంలో అక్షయ్‌కుమార్‌, కత్రినాలు కీలక పాత్రల్లో, రెండో చిత్రంలో జాన్‌ అబ్రహం, అనిల్‌కపూర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మరి ఈ మూడో చిత్రంలో ఎవరు నటిస్తారనే విషయంలో ఎలాంటి నిర్ణయం ప్రకటించ లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని