అసలైన ‘జాతిరత్నం’ అతనే..

నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ.. ఈ ముగ్గురిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలోనే పలు సినిమాలు చేసినా ఇటీవల వచ్చిన ‘జాతిరత్నాలు’తో వాళ్ల క్రేజ్‌ అమాంతం పెరిగింది. డైరెక్టర్‌ అనుదీప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాగ్‌అశ్విన్‌ నిర్మించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా సందడి చేసింది.

Published : 24 May 2021 21:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ.. ఈ ముగ్గురిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలోనే పలు సినిమాలు చేసినా ఇటీవల వచ్చిన ‘జాతిరత్నాలు’తో వాళ్ల క్రేజ్‌ అమాంతం పెరిగింది. డైరెక్టర్‌ అనుదీప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాగ్‌అశ్విన్‌ నిర్మించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా సందడి చేసింది. అది ఈ ఏడాది విడుదలై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ చిత్రబృందం రానా వ్యాఖ్యాతగా వ్యవహరించే ‘నంబర్‌ 1 యారి’ కార్యక్రమంలో తాజాగా పాల్గొని సందడి చేసింది.

ఈ సందర్భంగా అసలు ఈ సినిమాలో నిజమైన జాతిరత్నం ఎవరు అని రానా అడగ్గా నేనంటే నేనంటూ నవీన్‌, రాహుల్‌, ప్రియదర్శి పోటీపడ్డారు. కొద్దిసేపటి తర్వాత కార్యక్రమంలోకి నిర్మాత నాగ్‌ అశ్విన్‌ ప్రవేశించారు. అప్పుడు మరోసారి అదే ప్రశ్న అడగ్గా అప్పుడు నిర్మాత నాగ్‌ అశ్విన్‌ నిజమైన జాతిరత్నం అంటూ ముగ్గురూ చెప్పారు. అయితే, నిజమైన జాతిరత్నం తాను కాదని.. అసలైన రత్నం డైరెక్టర్‌ అనుదీప్‌ అని నాగ్‌ అశ్విన్‌ చెప్పడంతో ఆయనతో ఈ ముగ్గురూ కూడా మాట కలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని