Vijay: ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ వర్సెస్‌ విజయ్‌.. సంబంధమేంటంటే!

ఈ దశాబ్దంలో సమాజాన్ని ప్రభావితం చేస్తున్న అంశాల్లో సోషల్‌ మీడియా ట్రోలింగ్‌ ఒకటి. యువతను ఎక్కువగా ఆకర్షిస్తోన్న మీమ్స్‌ ప్రతి విషయంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. అసలు సోషల్‌ మీడియాలో...

Updated : 05 Sep 2022 23:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ దశాబ్దంలో సమాజాన్ని ప్రభావితం చేస్తున్న అంశాల్లో సోషల్‌ మీడియా ట్రోలింగ్‌ ఒకటి. యువతను ఎక్కువగా ఆకర్షిస్తోన్న మీమ్స్‌ ప్రతి విషయంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. అసలు సోషల్‌ మీడియాలో మీమ్స్‌ పేజీలదే హవా. అయితే మీమర్స్‌ తీసుకునే అంశాలు ఒక్కోసారి నెటిజన్లను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఏ విషయంలో ఎవరిని ట్రోల్‌ చేస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు.

తాజాగా ఇండియా పాకిస్థాన్‌ మ్యాచ్ జరిగిన రోజు కోలీవుడ్‌ స్టార్‌ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay)ని కొందరు మీమర్స్‌ టార్గెట్‌ చేశారు. మీమర్స్‌ ఆ తమిళ స్టార్‌ హీరోని ఎందుకు ట్రోల్‌ చేస్తున్నారనే విషయం తెలియక  కొందరు నెటిజన్లు అయోమయానికి గురయ్యారు. అసలు విజయ్‌ని టార్గెట్‌ చేయడానికి కారణమేంటంటే.. గతంలో కొందరు తమిళ మీమర్స్‌ తెలుగు అగ్రకథానాయకుల్ని ట్రోల్‌ చేశారు. దీంతో కొందరు తెలుగు మీమర్స్‌ విజయ్‌ని టార్గెట్‌ చేశారు. మామూలు రోజుల్లో కంటే ఇండియా పాకిస్థాన్‌ మ్యాచ్‌లు జరిగే రోజుల్లో ట్రోల్‌ చేస్తే మీమ్స్‌కి డిమాండ్‌ ఉంటుందని ఈ మీమర్స్‌ ఆలోచన. అందుకే ఇండియా మ్యాచ్‌ గెలిస్తే టీమిండియా పై మీమ్స్‌, ఇండియా ఓడిపోతే ఇళయదళపతిని ట్రోల్ చేయాలంటూ సోషల్‌ మీడియాలో అధికంగా మీమ్స్‌ కనిపించాయి.

సోషల్‌ మీడియాలో తమిళ, తెలుగు మీమర్స్‌ మధ్య హీరోల విషయంలో ఎప్పటినుంచో కోల్డ్‌ వార్‌ జరుగుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితి కాస్త వెరైటీగా ఉండటంతో నెటిజన్లు ‘విజయ్‌ని ఎందుకు ట్రోల్‌ చేస్తున్నారు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మీమర్స్‌ మాత్రం ‘ఊరికే’ ‘సరదాగా’ అంటూ ముక్తసరి జవాబులతో సరిపెట్టి మరింత హైప్‌ను పెంచుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు