Rajamouli: మహేశ్- రాజమౌళిల సినిమాలో ఆ తమిళహీరో ఉన్నారా..!

మహేశ్- రాజమౌళిల సినిమా అప్‌డేట్స్‌ కోసం అటు రాజమౌళి అభిమానులు ఇటు మహేశ్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరల్‌ అవుతోంది.

Published : 18 Oct 2022 01:22 IST

హైదరాబాద్‌: రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం అటు రాజమౌళి అభిమానులు ఇటు మహేశ్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరల్‌ అవుతోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త నెట్‌లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఇటీవల ఈ చిత్రబృందం తమిళ నటుడు కార్తితో సంప్రదింపులు జరిపారని. సినిమాలోని  ఓ కీలకపాత్రలో కార్తి కనిపించనున్నారని టాక్‌. కార్తి కూడా ఆసక్తికనబరచినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అటు కార్తి కానీ, ఇటు చిత్రబృందం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమా రాజమౌళి కెరీర్‌లోనే అతి పెద్ద చిత్రంగా ఉండబోతోంది. యాక్షన్‌ ప్రధానంగా సాగనున్న ఈ చిత్రం కోసం రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ కథ అందిస్తున్నారు. పూర్తి స్క్రిప్టు సిద్ధమవకముందే ఎన్నో అంచనాలు పెంచేసిన ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో కె.ఎల్‌.నారాయణ నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలిసే అవకాశం ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని