Yash 19: యశ్‌.. టాక్సిక్‌

కన్నడ కథానాయకుడు యశ్‌ కొత్త కబురు వినిపించారు. అందరూ అనుకున్నట్లుగానే ఆయన తన 19వ చిత్రం కోసం మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌తో చేతులు కలిపారు.

Updated : 09 Dec 2023 10:33 IST

న్నడ కథానాయకుడు యశ్‌ కొత్త కబురు వినిపించారు. అందరూ అనుకున్నట్లుగానే ఆయన తన 19వ చిత్రం కోసం మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌తో చేతులు కలిపారు. దీన్ని కెవీఎన్‌ ప్రొడక్షన్స్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ పతాకాలపై వెంకట్‌ కె.నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘టాక్సిక్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌.. అన్నది ఉపశీర్షిక. ఈ చిత్ర టైటిల్‌ను లోగోను శుక్రవారం విడుదల చేశారు. సినిమాని 2025 ఏప్రిల్‌ 10న విడుదల చేయనున్నట్లు ఆ ప్రచార చిత్రంతో స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకురాలు గీతూ మోహన్‌ మాట్లాడుతూ.. ‘‘కథను సరికొత్తగా చెప్పాలని నేనెప్పుడూ ప్రయోగాలు చేస్తుంటాను. ‘లైయర్స్‌ డైస్‌’, ‘మూతోన్‌’ లాంటి సినిమాలు రూపొందించినప్పుడు వాటికి అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయి. ఇక ఈ చిత్ర విషయానికొస్తే.. రెండు వేర్వేరు ప్రపంచాల కలయికగా ఈ కథ ఉంటుంది. యశ్‌ లాంటి అద్భుతమైన వ్యక్తితో కలిసి ఈ మ్యూజికల్‌ జర్నీని ప్రారంభించడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు. ‘‘ఇది మాకెంతో ప్రతిష్ఠాత్మకమైన చిత్రం. మాస్‌, యాక్షన్‌ అంశాల్ని మేళవించి బలమైన కథ తయారు చేయడానికి గీతూ ఎంతో కష్టపడ్డారు. ఈ అద్భుతమైన ప్రపంచాన్ని ఎప్పుడెప్పుడు చూపించాలా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’’ అన్నారు నిర్మాత వెంకట్‌. ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా కనిపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ‘కేజీఎఫ్‌’ సిరీస్‌ విజయాల తర్వాత యశ్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని