
Updated : 04 Nov 2020 08:50 IST
కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. తొలి నుంచి ట్రంప్ పాపులర్ ఓట్లలో ఆధిక్యత కనబరుస్తున్నప్పటికీ.. విజేతను నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో మాత్రం బైడెన్ ముందంజలో ఉన్నారు. అయితే, కీలక రాష్ట్రాలుగా భావిస్తున్న ఫ్లోరిడా, జార్జియాలో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. ఇద్దరు అభ్యర్థుల మధ్య తేడా అతిస్వల్పంగా ఉండడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
బైడెన్ గెలిచిన రాష్ట్రాలు.. | ట్రంప్ గెలిచిన రాష్ట్రాలు |
రాష్ట్రం | ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు | రాష్ట్రం | ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు |
కనెక్టికట్ | 07 | వ్యోమింగ్ | 03 |
డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా | 03 | వెస్ట్ వర్జీనియా | 05 |
డెలావేర్ | 03 | టెన్నెసీ | 11 |
ఇల్లినాయిస్ | 20 | సౌత్ డకోటా | 03 |
మసాచుసెట్స్ | 11 | సౌత్ కరోలైనా | 09 |
మేరీలాండ్ | 10 | ఒక్లహామా | 07 |
న్యూజెర్సీ | 14 | నెబ్రాస్కా | 03 |
న్యూ మెక్సికో | 05 | నార్త్ డకోటా | 03 |
న్యూయార్క్ | 29 | మిస్సిసిపీ | 06 |
రోడ్ ఐలాండ్ | 04 | లూసియానా | 08 |
వర్జీనియా | 13 | కెంటకీ | 08 |
వెర్మాంట్ | 03 | ఇండియానా | 11 |
కొలరెడో | 09 | అర్కాన్సాస్ | 06 |
అలబామా | 09 | ||
మొత్తం | 131 | మొత్తం | 92 |
♦ పాపులర్ ఓట్లలో మాత్రం ట్రంప్ 50.13 శాతం ఓట్లతో ముందంజలో ఉన్నారు. బైడెన్ 48.33 శాతం ఓట్లు సాధించారు.
Tags :