H1B Visa: హెచ్‌1బీ వీసాలపై యూఎస్‌సీఐఎస్‌ కీలక ప్రకటన..

అమెరికా కాంగ్రెస్‌ పేర్కొన్నట్లు 2023 ఆర్థిక సంవత్సరానికి 65,000 హెచ్‌1-బీ వీసాలు జారీ చేసేందుకు సరిపడా దరఖాస్తులు అందినట్లు యూఎస్‌ సిటిజన్‌ షిప్‌

Published : 24 Aug 2022 11:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా కాంగ్రెస్‌ పేర్కొన్నట్లు 2023 ఆర్థిక సంవత్సరానికి 65,000 హెచ్‌1-బీ వీసాలు జారీ చేసేందుకు సరిపడా దరఖాస్తులు అందినట్లు యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికాలో కంపెనీలు వృత్తి నిపుణుల పోస్టుల్లో విదేశీ ఉద్యోగులను నియమించుకొనేందుకు  వీలుగా నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ విధానంలో ఈ వీసాలను జారీ చేస్తుంది. అక్కడి టెక్నాలజీ కంపెనీలు ఈ వీసాపై ఎక్కువగా ఆధారపడి వేలకొద్దీ ఉద్యోగులను నియమించుకొంటాయి. విదేశీ వృత్తి నిపుణుల్లో వర్క్ వీసా తర్వాత అత్యంత ఆదరణ ఉన్న వీసా ఇదే.

‘‘అమెరికా కాంగ్రెస్‌ సూచించిన 65,000 హెచ్‌1బీ వీసాల మార్కును చేరుకొనేందుకు తగినన్ని దరఖాస్తులు వచ్చాయి. దీంతోపాటు అడ్వాన్స్‌డ్‌ డిగ్రీ మినహాయింపు కింద జారీ చేసే 20,000 హెచ్‌1బీ వీసాలకు కూడా 2023 ఆర్థిక సంవత్సరానికి తగినన్ని అప్లికేషన్లు వచ్చాయి’’ అని యూఎస్‌సీఐఎస్‌ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. నమోదుదారుల ఆన్‌లైన్‌ చిరునామాలకు ఇప్పటికే నోటిఫికేషన్లు కూడా పంపినట్లు పేర్కొంది. ఎంపిక కాని వారికి నాట్‌ సెలెక్టెడ్‌ అని సందేశం వస్తుంది.

మినహాయింపులు ఉన్న పిటిషన్లను మాత్రం స్వీకరించి ప్రాసెస్‌ చేస్తామని యూఎస్‌సీఐఎస్‌ పేర్కొంది. దీంతోపాటు ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్న హెచ్‌1బీ ఉద్యోగి సమయం పొడిగింపు, ఉద్యోగ నిబంధనల మార్పు, కొత్త యాజమాన్యాల కింద పనిచేసేందుకు వచ్చే దరఖాస్తులను ప్రాసెస్‌ చేస్తామని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు