H1B Visa: హెచ్1బీ వీసాలపై యూఎస్సీఐఎస్ కీలక ప్రకటన..
అమెరికా కాంగ్రెస్ పేర్కొన్నట్లు 2023 ఆర్థిక సంవత్సరానికి 65,000 హెచ్1-బీ వీసాలు జారీ చేసేందుకు సరిపడా దరఖాస్తులు అందినట్లు యూఎస్ సిటిజన్ షిప్
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా కాంగ్రెస్ పేర్కొన్నట్లు 2023 ఆర్థిక సంవత్సరానికి 65,000 హెచ్1-బీ వీసాలు జారీ చేసేందుకు సరిపడా దరఖాస్తులు అందినట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికాలో కంపెనీలు వృత్తి నిపుణుల పోస్టుల్లో విదేశీ ఉద్యోగులను నియమించుకొనేందుకు వీలుగా నాన్-ఇమ్మిగ్రెంట్ విధానంలో ఈ వీసాలను జారీ చేస్తుంది. అక్కడి టెక్నాలజీ కంపెనీలు ఈ వీసాపై ఎక్కువగా ఆధారపడి వేలకొద్దీ ఉద్యోగులను నియమించుకొంటాయి. విదేశీ వృత్తి నిపుణుల్లో వర్క్ వీసా తర్వాత అత్యంత ఆదరణ ఉన్న వీసా ఇదే.
‘‘అమెరికా కాంగ్రెస్ సూచించిన 65,000 హెచ్1బీ వీసాల మార్కును చేరుకొనేందుకు తగినన్ని దరఖాస్తులు వచ్చాయి. దీంతోపాటు అడ్వాన్స్డ్ డిగ్రీ మినహాయింపు కింద జారీ చేసే 20,000 హెచ్1బీ వీసాలకు కూడా 2023 ఆర్థిక సంవత్సరానికి తగినన్ని అప్లికేషన్లు వచ్చాయి’’ అని యూఎస్సీఐఎస్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. నమోదుదారుల ఆన్లైన్ చిరునామాలకు ఇప్పటికే నోటిఫికేషన్లు కూడా పంపినట్లు పేర్కొంది. ఎంపిక కాని వారికి నాట్ సెలెక్టెడ్ అని సందేశం వస్తుంది.
మినహాయింపులు ఉన్న పిటిషన్లను మాత్రం స్వీకరించి ప్రాసెస్ చేస్తామని యూఎస్సీఐఎస్ పేర్కొంది. దీంతోపాటు ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్న హెచ్1బీ ఉద్యోగి సమయం పొడిగింపు, ఉద్యోగ నిబంధనల మార్పు, కొత్త యాజమాన్యాల కింద పనిచేసేందుకు వచ్చే దరఖాస్తులను ప్రాసెస్ చేస్తామని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుతిన్, జిన్‌పింగ్ ఆలింగనంపై.. వైట్‌హౌస్ జోకులు
చైనా పర్యటన చేపట్టిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఆ దేశాధినేత జిన్‌పింగ్‌ను ఆలింగనం చేసుకోవడంపై వైట్‌హౌస్ వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. -
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
Taiwan: తైవాన్‌లో పార్లమెంట్ సభ్యులు విచక్షణ మరిచి పరస్పరం దాడికి దిగారు. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. -
కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని కిర్గిస్థాన్ (Kyrgyzstan) రాజధానిలో మూక హింస చెలరేగడంతో.. భారత విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. -
మరింత సంపన్నులైన రిషి, అక్షతా దంపతులు
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తిలు మరింత సంపన్నులు అయ్యారు. -
అధ్యక్ష పదవికి భారతీయ అమెరికన్ పోటీ!
పాలక డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా (47) మున్ముందు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందని ఆయన సహచరులు భావిస్తున్నారు. -
2050 నాటికి పెరగనున్న ఆయుర్దాయం
ప్రపంచవ్యాప్తంగా 2022 నుంచి 2050 మధ్య ఆయుర్దాయం పురుషుల్లో 5 సంవత్సరాలు, మహిళల్లో 4 ఏళ్లు పెరుగుతుందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం అంచనా వేసింది. -
ఉత్తర గాజాలో హోరాహోరీ
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరు హోరాహోరీ సాగుతోంది. ముఖ్యంగా ఉత్తర గాజాలో జబాలియా కేంద్రంగా దాడులు, ప్రతిదాడులు భారీస్థాయిలో కొనసాగుతున్నాయి. -
ఆగ్నేయాసియాలో రక్తపోటు బాధితులు 29.4 కోట్ల మంది : డబ్ల్యూహెచ్‌వో
అధిక రక్తపోటు కారణంగా గుండె పోటు, పక్షవాతం, క్యాన్సర్ల లాంటి సాంక్రమికేతర వ్యాధులతో పాటు మరణం, వైకల్యం సంభవించే ముప్పు ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ సైమా వాజెడ్ చెప్పారు. -
ఖర్కీవ్‌ను ఆక్రమించే ప్రణాళికల్లేవ్
ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్ ప్రాంతంలో బఫర్ జోన్ ఏర్పాటే అక్కడ తమ తాజా దాడుల లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. -
నరమేధానికి పాల్పడలేదు
గాజాలో తాము నరమేధానికి పాల్పడుతున్నామన్న ఆరోపణలను ఇజ్రాయెల్ తిరస్కరించింది. పౌరుల భద్రత కోసం అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అంతర్జాతీయ న్యాయస్థానానికి (ఐసీజే) తెలిపింది. -
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి
యువకుడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. ఎట్టకేలకు ఓ సోషల్ మీడియా పోస్టు ఆధారంగా బాధితుడిని రక్షించారు. -
ఉ.కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
ఉత్తరకొరియా మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. శుక్రవారం స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణకొరియా ధ్రువీకరించింది. -
పర్యావరణ హితులకు యూఏఈ ‘బ్లూ రెసిడెన్సీ వీసా’లు
పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతను ప్రోత్సహించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. -
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
Elon Musk: మరో 30 ఏళ్లలో అంగారక గ్రహంపై ఏర్పాటయ్యే నగరంలో మనుషులు జీవిస్తారని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోడ్‌పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్‌లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్