ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణతోపాటు ప్రస్తుతమున్న ఇసుక విధానం ..

Updated : 05 Nov 2020 12:03 IST

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణతోపాటు ప్రస్తుతమున్న ఇసుక విధానం స్థానంలో కొత్తది తీసుకొచ్చే అంశంపై చర్చించే అవకాశముంది. దీనిపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మరోవైపు ఈ నెల మూడో వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై మంత్రివర్గంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వైద్య కళాశాలలకు భూ కేటాయింపులు, రవాణా పన్నుల పెంపు ప్రతిపాదనలు తదితర అంశాలపై చర్చించే అవకాశముంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని