రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి అధ్వానం:లక్ష్మణ్‌

దళారులకు కొమ్ముకాసే కొన్ని రాజకీయశక్తులు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై తప్పుడు ప్రచారం చేస్తు్న్నాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు

Published : 18 Dec 2020 02:09 IST

హైదరాబాద్‌: దళారులకు కొమ్ముకాసే కొన్ని రాజకీయశక్తులు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై తప్పుడు ప్రచారం చేస్తు్న్నాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. వ్యవసాయ చట్టాలతో మేలు జరుగుతుంటే రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్‌ మాట్లాడారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు చేపడితే కమ్యూనిస్టులు, ఇతర పార్టీలు దుష్ర్పచారం చేశాయన్నారు. నాటి ఆర్థిక సంస్కరణల వల్లే ప్రపంచంలో 5వ అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ నిలిచిందన్నారు. 

తెరాస వంటి ప్రాంతీయ పార్టీలు దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని లక్ష్మణ్‌ ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మోదీ ప్రభుత్వం కనీస మద్దతు ధర పెంచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఓయూ విద్యార్థిపై తెరాస నేతలు దాడికి పాల్పడ్డారని.. దీన్ని భాజపా తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. ఆరేళ్ల తెరాస పాలనలో ఉద్యోగుల పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు. పట్టభద్రుల, కార్పొరేషన్‌ ఎన్నికల్లో లబ్ధికోసం ఉద్యోగాల పేరుతో తెరాస నాటకాలాడుతోందని లక్ష్మణ్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని