డీకే అరుణ, రామచందర్‌రావు గృహనిర్బంధం

సిద్దిపేట ఘటన నేపథ్యంలో భాజపా నేతలు ప్రగతి భవన్‌ను ముట్టడించే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు పలువురు భాజపా నేతలను

Updated : 27 Oct 2020 10:08 IST

హైదరాబాద్‌: సిద్దిపేట ఘటన నేపథ్యంలో భాజపా నేతలు ప్రగతి భవన్‌ను ముట్టడించే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు పలువురు భాజపా నేతలను గృహనిర్బంధం చేశారు. ఎమ్మెల్సీ రామచందర్‌రావు, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, ఇతర నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పోలీసుల తీరుపట్ల భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహనిర్బంధం చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఎమ్మెల్సీ రామచందర్‌రావు విమర్శించారు. దుబ్బాకలో భాజపా గెలిచే అవకాశాలు మెండుగా ఉండటంతోనే తెరాస ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. దుబ్బాక ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సిందేనని డీకే అరుణ స్పష్టం చేయగా.. ఇంటి నుంచి బయటకి రావొద్దని పోలీసులు సూచిస్తున్నారు. దీంతో డీకే అరుణ నివాసం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని