ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి: చాడ

గ్రేటర్‌ ఎన్నికల్లో ఉమ్మడిగా బరిలోకి దిగిన వామపక్ష నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. హిమాయత్‌ నగర్‌ ఏఐటీయూసీ భవన్‌ నుంచి అదే...

Updated : 12 Oct 2022 15:32 IST

హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల్లో ఉమ్మడిగా బరిలోకి దిగిన వామపక్ష నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. హిమాయత్‌ నగర్‌ ఏఐటీయూసీ భవన్‌ నుంచి అదే ప్రాంతంలోని వివిధ బస్తీలు, కాలనీల్లో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం మంగళవారం పాదయాత్ర నిర్వహించారు. హిమాయత్‌ నగర్‌ డివిజన్‌ సీపీఐ అభ్యర్థి ఛాయాదేవిని అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ.. గ్రేటర్‌లో ప్రశ్నించే గొంతుక కరవైందని.. ఈ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. 

మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల అనేక బస్తీలు నీటమునిగాయని.. తిండి లేక ఇంట్లో ఉన్న వస్తువులు పోగొట్టుకుని ప్రజలు రోడ్డున పడ్డారని చాడ ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల పట్టాలు, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్న డిమాండ్‌తో తాము ప్రజల్లోకి వెళుతున్నట్లు ఈ సందర్భంగా చాడ వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని