Published : 30 Sep 2020 17:13 IST

ఏం సాధించారని తెరాస సంబురాలు?: జీవన్‌రెడ్డి

జగిత్యాల: రెవెన్యూ చట్టంతో ఏం సాధించారని తెరాస సంబురాలు నిర్వహిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు. జగిత్యాలలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. తెరాస సంబురాలు ప్రజలపై పన్నుల భారం మోపేందుకేనని విమర్శించారు. మరోవైపు ఎల్‌ఆర్‌ఎస్‌ను గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయటం ఆశ్చర్యం కలిగిస్తోందని జీవన్‌రెడ్డి అన్నారు. మరో రెండు నెలలు ఆగితే సీఎం కేసీఆర్‌ నిజస్వరూపం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. 

ముందుగా సన్నరకం ధాన్యం ధర క్వింటాలుకు రూ.2500గా ప్రకటించి సంబురాలు చేసుకోవాలని జీవన్‌రెడ్డి హితవు పలికారు. సన్నరకాలను సాగు చేయాలని సీఎం సూచించారని.. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనాలని ఆయన డిమాండ్‌ చేశారు. మక్కలకు మద్దతు ధర రూ.1850 ఉంటే మార్కెట్లో రూ.1300 మాత్రమే ఉందని.. దీనివల్ల రైతులు క్వింటాలుకు రూ.550 నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మక్కలను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని జీవన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని