ఆయుష్‌ కార్యదర్శి సస్పెన్షన్‌కు కనిమొళి డిమాండ్‌

ఆయుష్‌ కార్యదర్శి వైద్య రాజేశ్‌ కొటెచ్చాపై చర్యలు తీసుకోవాలంటూ డీఎంకే నేత, ఎంపీ కనిమొళి డిమాండ్‌ చేశారు. హిందీ మాట్లాడడం రాని వారు శిక్షణ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లాలని ఆయన సూచించినందుకు ఆయనపై............

Published : 23 Aug 2020 02:57 IST

చెన్నై: ఆయుష్‌ కార్యదర్శి వైద్య రాజేశ్‌ కొటెచ్చాపై చర్యలు తీసుకోవాలంటూ డీఎంకే నేత, ఎంపీ కనిమొళి డిమాండ్‌ చేశారు. హిందీ మాట్లాడడం రాని వారు శిక్షణ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లాలని ఆయన సూచించినందుకు ఆయనపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఆయుష్‌ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌కు ఆమె లేఖ రాశారు. ఆయుష్‌ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చువల్‌ శిక్షణా కార్యక్రమం ఈ వివాదానికి వేదికైంది. దీనికి హాజరైన హిందీ మాట్లాడడం రాని, అర్థం చేసుకోలేని యోగా టీచర్లు, మెడికల్‌ ప్రాక్టీస్‌నర్లు కార్యక్రమం నుంచి వైదొలగాలంటూ ఆయుష్‌ కార్యదర్శి వ్యాఖ్యానించారు. ఈ శిక్షణకు తమిళనాడు నుంచి పలువురు హాజరయ్యారు.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో కనిమొళి స్పందించారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇంకెంతకాలం ఇలాంటి వివక్ష అని ప్రశ్నించారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం మానుకోవాలని ట్వీట్‌ చేశారు. ఆయుష్‌ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ కూడా డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రధాని కార్యాలయాన్ని జోడిస్తూ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ, చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం సైతం దీన్ని ఖండించారు. ఇటీవల ఎయిర్‌పోర్టులో హిందీ మాట్లాడడం రాదన్నందుకు కనిమొళిని ఓ సీఐఎస్‌ఎఫ్‌ అధికారి ‘మీరు భారతీయులేనా’ అని ప్రశ్నించడం కలకలం రేపింది. ఈ ఘటన మరిచిపోక ముందే హిందీకి సంబంధించి మరో వివాదం తెరపైకి రావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని