యోగి వ్యాఖ్యలపై క్షమాపణ కోరిన ఎస్పీ

అయోధ్యలో నిర్మించబోయే మసీదు శంకుస్థాపనకు తాను వెళ్లబోనంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ అభ్యంతరం తెలిపింది. ఆయన వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేసింది. ఇటీవల జరిగిన రామమందిరం.........

Published : 08 Aug 2020 01:11 IST

లఖ్‌నవూ: అయోధ్యలో నిర్మించబోయే మసీదు శంకుస్థాపనకు తాను వెళ్లబోనంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ అభ్యంతరం తెలిపింది. ఆయన వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేసింది. ఇటీవల జరిగిన రామమందిరం భూమి పూజకు యోగి హాజరైన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో మసీదు శంకుస్థాపనకు వెళ్తారా అంటూ ఓ టీవీ ఛానల్‌ యోగిని ప్రశ్నించింది. దీనికి ఆదిత్యనాథ్‌ స్పందిస్తూ.. ఒక ముఖ్యమంత్రిగా అయితే వెళ్తాను.. కానీ ఒక యోగిగా, హిందువుగా తాను వెళ్లబోను అంటూ సమాధానమిచ్చారు. అయినా తనకు అలాంటి ఆహ్వానమేదీ రాదని సమాధానం ఇచ్చారు. తాను అక్కడికి వెళ్లి కొందరి లౌకికవాదాన్ని ప్రమాదంలో పడవేయదలచుకోలేదన్నారు. ప్రభుత్వ పథకాలు ఎలాంటి వివక్షా లేకుండా అందరికీ అందించడమే తన పని అని చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఎస్పీ అధికార ప్రతినిధి పవన్‌ పాండే తప్పుబట్టారు. ముఖ్యమంత్రిగా నాడు చేసిన ప్రమాణాన్ని ఆయన ఉల్లంఘించారని విమర్శించారు. ఆయనో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని, కేవలం ఓ వర్గానికి మాత్రమే కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. యోగి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడేందుకు యూపీ కాంగ్రెస్‌ నిరాకరించింది. ఆ పార్టీ రాముడు తమవాడే అన్నట్లు ప్రచారం చేసుకుంటోందని, రాముడు అందరి వాడని భాజపానుద్దేశించి వ్యాఖ్యానించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని