డీఆర్సీలో వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే వాగ్వాదం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో డీఆర్సీ సమావేశం రసాబాసగా మారింది. టిడ్కో ఇళ్ల కేటాయింపులో అవినీతి జరిగిందని వైకాపా ఎంపీ పిల్లి

Updated : 24 Nov 2020 13:11 IST

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో డీఆర్సీ సమావేశం రసాభాసగా మారింది. టిడ్కో ఇళ్ల కేటాయింపులో అవినీతి జరిగిందని వైకాపా ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఆరోపించగా.. ఆ వ్యాఖ్యలను అదే పార్టీకి చెందిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఖండించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తెదేపా హయాంలోనే అవినీతి జరిగిందని ద్వారంపూడి వాదనకు దిగారు. దీనిపై తెదేపా ఎమ్మెల్యేలు చినరాజప్ప, వేగుళ్ల జోగేశ్వరరావు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో జోగేశ్వరరావును ద్వారంపూడి పక్కకు నెట్టేశారు. అనంతరం కాకినాడ నగరం, గ్రామీణ ప్రాంతం ముంపు బారిన పడుతుందని.. మేడలైను వంతెన నిర్మాణాన్ని తక్షణం ఆపేయాలని ఎంపీ సుభాష్‌ చంద్రబోస్‌ కోరగా.. ఈ విషయంలో ద్వారంపూడి, బోస్‌ మధ్య మళ్లీ తీవ్ర వాగ్వాదం జరిగింది. నేతల వాగ్వాదంతో డీఆర్సీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్‌ అర్ధాంతరంగా ముగించారు. సమావేశం ముగిసిన తర్వాత కూడా నేతలిద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని