ఆప్‌ ఎమ్మెల్యేపై ఇంక్‌తో దాడి.. ఆపై అరెస్ట్!

దిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ ప్రభుత్వానికి, అక్కడి ఆస్పత్రులకు......

Published : 11 Jan 2021 19:13 IST

రాయ్‌బరేలీ: దిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతిపై దాడి యూపీలో జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించేందుకు రాయ్‌బరేలీలో ప్రభుత్వ అతిథి గృహం నుంచి బయటకు వస్తున్న ఆయన ముఖంపై ఓ వ్యక్తి సిరాతో చల్లాడు. మరోవైపు, ఈ ఘటన అనంతరం పోలీసులు సోమనాథ్‌ భారతిని అరెస్టు చేశారు. యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ అదుపులోకి తీసుకున్నారు. నేరపూరిత బెదిరింపులకు పాల్పడటం, వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించేలా వ్యవహరించినందుకుగాను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆయన్ను అమేఠీకి తరలించారు. ఆయనపై జరిగిన సిరా దాడి ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

యూపీ సర్కార్‌ చర్యను ఆప్‌ ఖండించింది. సోమనాథ్‌ భారతిపై సిరా దాడి కలతకు గురిచేసిందని ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ అన్నారు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే యూపీ ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. భారతిపై దాడిని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఖండించారు. ఇలాంటి దాడులు మానుకొని ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు ఏర్పాటుపై యూపీ సర్కారు దృష్టిసారించాలని హితవు పలికారు.
 

ఇదీ చదవండి..

చంపేసి.. సూట్కేసులో కుక్కేసి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని