Akhilesh : సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్‌కు ఇంకా టికెట్‌ రాలేదు.. అఖిలేశ్‌ యాదవ్‌ వ్యంగ్యాస్త్రాలు!

ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భాజపా (BJP) విడుదల చేసిన రెండు జాబితాల్లో ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ (Shivraj Singh Chouhan) పేరు లేకపోవడంపై సమాజ్‌వాదీ (Samajwadi) పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ (Akhilesh Yadav) వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Published : 02 Oct 2023 01:59 IST

ఇంటర్నెట్ డెస్క్ : భాజపా (BJP) విడుదల చేసిన అభ్యర్థుల జాబితాల్లో మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ (Shivraj Singh Chouhan) పేరు లేకపోవడంపై సమాజ్‌వాదీ (Samajwadi) పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ (Akhilesh Yadav) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ముఖ్యమంత్రికి టికెట్ కేటాయిస్తామని ఇప్పటిదాకా ప్రకటించలేదు. భాజపాలోని నాయకులందరూ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో భాజపా ఎంత భయపడుతోందో ఊహించుకోవచ్చని’ ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో భాజపాను గద్దె దించాలంటే కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ కలిసి పనిచేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. 

వచ్చే ఎన్నికల తర్వాత తెదేపా - జనసేన ప్రభుత్వమే: పవన్‌ కల్యాణ్‌

అంతకముందు కాంగ్రెస్‌ సైతం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు టికెట్ రాని విషయాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేసింది. ‘భాజపా జాబితాలు బయటకు వస్తున్నాయి. ఈ విషయంపై మాట్లాడటానికి శివరాజ్‌ వద్ద ఎలాంటి సమాచారం లేదు. ఎందుకంటే వాటిలో ఆయనకు గిట్టని వారి పేర్లున్నాయి. ఇన్నాళ్లయినా ఇంకా చౌహాన్‌ పేరు జాబితాల్లో కనిపించడం లేదు. ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చివరి జాబితాలోనైనా ఆయన పేరు ఉంటుందో లేదో తెలియడం లేదని’ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రాగిణి నాయక్‌ అన్నారు. 

భాజపా ఇప్పటి వరకు 79 పేర్లను ప్రకటించింది. అందులో కేంద్రమంత్రులు నరేంద్ర తోమర్‌, ప్రహ్లాద్‌ పటేల్, భాజపా ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ పేర్లున్నాయి. వీరంతా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడే అవకాశం ఉంది. వీరు మాత్రమే కాక ఎంపీలు గణేశ్‌ మంత్రి, రాకేశ్ సింగ్‌, రీతి పాఠక్‌లకు భాజపా సీట్లు కేటాయించింది. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఎన్నికల సంఘం ఇంత వరకూ షెడ్యూల్ విడుదల చేయలేదు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని