నేపాల్‌, శ్రీలంకలోనూ భాజపా విస్తరణ!

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. భాజపాను త్వరలో నేపాల్‌, శ్రీలంకకు విస్తరింపజేసేందుకు అధిష్ఠానం యోచిస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు తెరలేపాయి.

Published : 15 Feb 2021 09:50 IST

గువహటి: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. భాజపాను త్వరలో నేపాల్‌, శ్రీలంకల్లో విస్తరింపజేసేందుకు అధిష్ఠానం యోచిస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు తెరలేపాయి. ఈ మేరకు ఆయన అగర్తలాలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘కేవలం మన దేశంలోనే కాదు.. పొరుగు దేశాల్లోనూ భాజపాను విస్తరించాలని పార్టీ యోచిస్తోంది. నేపాల్‌, శ్రీలంకలో పార్టీ విస్తరణకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వద్ద ప్రణాళికలు ఉన్నాయి. ఈ విషయాన్ని అమిత్‌షా గతంలో పార్టీ ఈశాన్య రాష్ట్రాల పార్టీ కార్యదర్శి అజయ్‌ జమ్వాల్‌తో స్వయంగా ప్రస్తావించించారు’ అని బిప్లవ్‌దేవ్‌ నాటి సంభాషణను వివరించారు. 

అదేవిధంగా పశ్చిమబెంగాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటమి పాలవడం ఖాయమని బిప్లవ్‌ దేవ్‌ అభిప్రాయపడ్డారు. భాజపాను ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరింపజేయడంలో షా అమితమైన కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీల చేతుల్లో ఉన్న కేరళలోనూ భాజపా మార్పు తెస్తుందన్నారు.  

త్రిపుర సీఎం బిప్లవ్‌ దేవ్‌ గతంలోనూ ఓ సారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇంటర్నెట్‌, శాటిలైట్‌ టెక్నాలజీ మహాభారత కాలంలోనే ఉన్నాయని.. వాటిని అమెరికన్లు, యూరోపియన్లు ఇప్పుడు వినియోగించుకొంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

ఇదీ చదవండి

స్థిమితంగా కూర్చోనివ్వం: టికాయిత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని