Bandi Sanjay: జూబ్లీహిల్స్‌ అత్యాచార కేసును సీబీఐకి అప్పగించాలి: బండి సంజయ్‌

నగరంలోని జూబ్లీహిల్స్‌లో బాలికపై అత్యాచార ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు

Updated : 04 Jun 2022 14:55 IST

హైదరాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌లో బాలికపై అత్యాచార ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. అత్యాచార ఘటనపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. ‘నిందితులను రక్షించడానికి పోలీస్‌ శాఖ కేసును పక్కదోవ పట్టిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి భేషజాలకు పోకుండా కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలి. ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా ప్రభుత్వం తమ నిర్ధోషిత్వాన్ని, నిందితులకు అండగా లేము అనే అపవాదును తొలగించుకోవాలి.

ఈ ఘటనలో అధికార పక్షానికి దగ్గరగా ఉన్నవారు, తెరాసకు మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీకి చెందిన కుటుంబసభ్యుల ప్రమేయం ఉంది. పలుకుబడి కలిగిన వారి కుటుంబసభ్యుల ప్రమేయం ఉన్న సంఘటనలో రాష్ట్ర పోలీస్‌ శాఖ నిష్పాక్షికంగా ఏ విధంగా దర్యాపు జరుపుతుంది? రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించకపోతే.. న్యాయపోరాటం చేసి బాధితులకు అండగా నిలబడతాం. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. తెలంగాణలో పబ్‌లను మూసివేయాలని కోరుతున్నాం’’ అని కేసీఆర్‌కు రాసిన లేఖలో బండి సంజయ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని