Bandi sanjay: అందుకే ఈనెల 15న ఖమ్మంలో అమిత్‌షా సభ: బండి సంజయ్
వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో కమలం వికసిస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో శుక్రవారం ఏర్పాటు చేసిన భాజపా సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఖమ్మం: అప్పుల రాష్ట్రం అభివృద్ధి రాష్ట్రంగా మారాలని కోరుకుంటున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఖమ్మంలో శుక్రవారం ఏర్పాటు చేసిన భాజపా సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మంలో భాజపా లేదని కొందరు అవమానిస్తున్నారన్నారు. జిల్లా ప్రజలకు భరోసా కల్పించేందుకే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఈనెల 15న సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆ సభకు భారీగా తరలివచ్చి భాజపా బలమేంటో ఇక్కడి కార్యకర్తలు చూపాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో కమలం తప్పకుండా వికసిస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: హైదరాబాద్లో పలుచోట్ల ఐటీ సోదాలు
-
TDP: ఎవరెస్ట్ వద్ద ఎగిరిన పసుపుజెండా
-
Justice Lakshmana Reddy: జస్టిస్ లక్ష్మణరెడ్డి అరుదైన రికార్డు
-
మీ వాళ్లు కబ్జా చేస్తే.. మీరు సెటిల్మెంట్ చేశారు: ఆదోని ఎమ్మెల్యే కుమారుడిని చుట్టుముట్టిన జనం
-
‘భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అవమానించినప్పుడు ఏం చేశారు?’
-
AP News: హోం మంత్రి వస్తే ఊరొదిలి వెళ్లాలా?