Politics: బెంగాల్‌ అసెంబ్లీలో గందరగోళం

పశ్చిమ్‌బెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి శాసనసభ సమావేశాల్లో గందరగోళం చోటు చేసుకుంది. అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ ప్రసంగిస్తుండగా ప్రతిపక్ష భాజపా ఎమ్మెల్యేలు...

Published : 03 Jul 2021 01:17 IST

ప్రసంగం ముగించకుండానే వెళ్లిపోయిన గవర్నర్‌

కోల్‌కతా: పశ్చిమ్‌బెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి శాసనసభ సమావేశాల్లో గందరగోళం చోటు చేసుకుంది. అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ ప్రసంగిస్తుండగా ప్రతిపక్ష భాజపా ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రసంగం పూర్తికాకుండానే గవర్నర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

2021-22 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ సమావేశాలను నేటి నుంచి జులై 8 వరకు నిర్వహించాలని బెంగాల్‌ ప్రభుత్వం నిర్ణయించింది.  జులై 7న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తుండగా.. ప్రతి పక్ష భాజపా సభ్యులు నిరసనకు దిగారు. ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకున్న దాడులను ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో దాదాపు 5 నిమిషాలపాటు గవర్నర్‌ తన ప్రసంగాన్ని నిలిపివేశారు. అయినప్పటికీ సభ్యులు ఆందోళనను విరమించకపోవడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఇది భాజపా పన్నిన ఎత్తుగడ అని, అందువల్లే గవర్నర్‌ మధ్యలో ప్రసంగాన్ని ఆపేసి వెళ్లిపోయారని తృణమూల్‌ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు స్పీకర్‌ బిమన్‌ బెనర్జీ సభను మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని