CM KCR: ధరణి తీసేస్తే ‘రైతు బంధు’ ఎలా జమ అవుతుంది?: సీఎం కేసీఆర్‌

యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌రెడ్డి భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)లో చేరారు.

Updated : 24 Jul 2023 20:38 IST

హైదరాబాద్‌: యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌రెడ్డి భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)లో చేరారు. ఇవాళ భువనగిరి పట్ణణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన కీలక సమావేశం ఏర్పాటు చేశారు. భువనగిరి నియోజకవర్గంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చేస్తున్నది తప్పని అనిల్ కుమార్ రెడ్డి బహిరంగంగానే ఆరోపణలు చేశారు. తన అనుచరులతో సమావేశం నిర్వహించిన అనంతరం అనిల్‌ కుమార్‌రెడ్డి నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్ సమక్షంలో భారాసలో చేరారు.

అనిల్‌కుమార్‌ రెడ్డి చేరిక సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణలో రైతుల పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. ధరణి పోర్టల్‌ తెచ్చి భూములను డిజిటలైజేషన్‌ చేశామని వివరించారు. ధరణి ద్వారా యజమానులు మాత్రమే భూమి ఇతరులపైకి మార్చగలరన్నారు. అలాంటి ధరణిని తీసేస్తే రైతు బంధు నిధులు ఎలా జమ అవ్వాలి?అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాకముందు విద్యుత్‌ లేక పొలాలు ఎండిపోయేవని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. 3 గంటల విద్యుత్‌ అంటే కాంగ్రెస్‌ను రైతులు తిట్టుకుంటున్నారని.. 24 గంటలు ఇస్తే ఎవరికి అవసరమైనప్పుడు వారు వాడుకుంటారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని